గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల కన్నీటి గాథలు.. అమెరికా- ఇరాన్ యుద్ధంతో దుబాయ్‌లో మారిన సీన్!
నాడు లక్షలాది మందికి అన్నం పెట్టిన ఆశాదీపం.. పశ్చిమాసియా యుద్ధంతో నివురు గప్పిన నిప్పులా మారింది. అమెరికా- ఇరాన్ యుద్ద సంక్షోభంతో మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు కోల్పోయి, సరిగ్గా జీతాలు అందగా దుబాయ్‌లోని వలస కార్మీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? యుద్ధ మేఘాల వెనుక దాగున్న చేదు నిజాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపాధి నిమిత్తం ఏటా మన దేశంలో నుంచి ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. కానీ అమెరికా-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలపై పడిన ప్రభావం ఇప్పుడు అక్కడికి వెళ్లిన వేలాది మంది వలస కార్మికులు పాలిట శాపంగా మారింది. ఇరాన్ క్షిపణి దాడులతో దుబాయ్ సహా అనేక గల్ఫ దేశాల్లో పర్యాటకం సహా అనేక వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్ నుంచి ఉపాది కోసం వెళ్లిన చాలా మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి, జీతాల సరిపోకా నానా తంటాలు పడాల్సి వస్తోంది. అయితే అక్కడ పరిస్థితి తాత్కాలికమేనని యూఏఈ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఉద్యోగాల కొతర
ఫిలిప్పీన్స్‌కు చెందిన 44 ఏళ్ల జాయ్ వివాండా అనే మహిళ గత నాలుగు నెలలుగా జాబ్ కోసం ఎండలో పడి దూబయ్ వీధుల్లో తిరుగుతున్నప్పటికీ ఆమెకు ఎలాంటి పని లభించడం లేదని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. క్షిపణి దాడుల కారణంగా అమె ఇంతకు ముందు పనిచేసే రష్యన్ ఫ్యామిలీ.. దుబాయ్ వదిలి వెళ్లిపోయిందని.. దాంతో తన జాబ్‌కూడా పోయిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తనకు నలుగురు పిల్లలను ఉన్నారని.. వాళ్లని పోషించాల్సి రావడంతో తాను స్వదేశానికి కూడా తిరిగి వెళ్లలేని పరిస్థితిలో ఉందని తెలిపింది. తనలాగే వందలాది మంది వలస కార్మికులు చేతిలో రెజ్యూమేలు పట్టుకుని ఉద్యోగాల కోసం ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది.
నిలిచిపోయిన వ్యాపారాలు
భారత్‌కు చెందిన మరో అకౌంటెంట్ మాట్లాడుతూ.. తాను పనిచేసే క్యాటరింగ్ కంపెనీలో వ్యాపారం పూర్తిగా పడిపోయిందని.. దీంతో తనతో పాటు సహోద్యోగులను కూడా తొలగించారని తెలిపారు. వ్యాపారం నగవక పోవడంతో.. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేక.. వారిని జాబ్‌లోంచి తీసేస్తున్నారని తెలిపారు. కొన్ని నివేదికల ప్రకారం.. దుబాయ్‌లోని ప్రతి నాలుగు కంపెనీలలో ఒకటి 2026 మూడో త్రైమాసికంలో లేయాప్స్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపింది.
జీతాల కోతతో అవస్థలు
అయితే మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించకపోయినప్పటికీ.. జీతాలు మాత్రం సరిగ్గా ఇవ్వట్లేని ఈజిప్టుకు చెందిన ఓ సేల్స్ ఉమెన్ చెప్పుకొచ్చారు. పర్యాటకుల రాక తగ్గడంతో వ్యాపారాలు లేక తన జీతాన్ని కమీషన్ బేసిస్‌కు మార్చారని, కానీ రోజుకు కనీసం $150 సేల్స్ కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కామరూన్‌కు చెందిన వెల్డర్ యానిక్ ఓబీ మాట్లాడుతూ.. రోజు ఆఫీస్‌కు వెళ్తున్నప్పటికీ ఎలాంటి ప్రాజెక్టులు, పనులు లేవని చెప్పారు.
ప్రభుత్వ చర్యలు
అయితే దేశంలోని వ్యాపార రంగాన్ని ఆదుకునేందుకు యూఏఈ ప్రభుత్వం సుమారు $680 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని.. ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్-మర్రి తెలిపారు. ఈ సంక్షోభం అనేది తాత్కాలికమేనని, యూఏఈకి ఇలాంటి సవాళ్లను తట్టుకోవడం కొత్తేం కాదని తెలిపారు.
స్వదేశాల్లోని కుటుంబాలపై ప్రభావం
అయితే అక్కడెక్కడో దుబాయ్‌లో ఉన్న వ్యక్తి.. ఉద్యోగం పోతే ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ల ఫ్యామిలీలపై పడుతుంది. ఎలా అంటే.. దూబాయ్‌లోని ఓ హోట్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోవడంతో తిరిగి ఇండియాకు వచ్చేశాడు. కానీ ఇక్కడ సరైన ఉపాధి దొరకపోవడంతో.. తన పిల్లల చదువుల కోసం దుబాయ్ వెళ్లడం ఎంతో ముఖ్యమని, లేదంటే వారి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
