AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. భయాందోళనల్లో జనం!

శుక్రవారం (జూలై 17) దక్షిణ మెక్సికో పసిఫిక్ తీరంలో గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి భారీ ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం నమోదుకాలేదని మెక్సికో, గ్వాటెమాలా అధికారులు తెలిపారు. అయితే పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Earthquake: మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. భయాందోళనల్లో జనం!
Mexico Earthquake
Balaraju Goud
|

Updated on: Jul 17, 2026 | 10:55 PM

Share

శుక్రవారం (జూలై 17) దక్షిణ మెక్సికో పసిఫిక్ తీరంలో గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి భారీ ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం నమోదుకాలేదని మెక్సికో, గ్వాటెమాలా అధికారులు తెలిపారు. అయితే పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

అమెరికా భూగర్భ శాస్త్ర సంస్థ (USGS) ప్రకారం, భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్ర తీరానికి సమీపంలో అక్విలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశలో సుమారు 48 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ప్రధాన భూకంపం అనంతరం సముద్రంలో స్వల్ప తీవ్రతతో మరో ప్రకంపన కూడా చోటుచేసుకుంది.

భూకంపం నేపథ్యంలో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలకు ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ మెక్సికో, గ్వాటెమాలా తీర ప్రాంతాల్లో ఒక మీటర్ సుమారు మూడు అడుగుల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, పనామా, పెరూ దేశాల పసిఫిక్ తీరాల్లో 0.3 మీటర్ల వరకు అలలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది.

మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులోని సుచియాటే నగర మేయర్ ఎల్మర్ వాజ్క్వెజ్ గల్లార్డో మాట్లాడుతూ, తీర ప్రాంతాలను అప్రమత్తం చేశామని, సునామీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. టపాచులా నగరంలో మొదట స్వల్పంగా ప్రారంభమైన ప్రకంపనలు కొద్ది సేపటికే తీవ్రరూపం దాల్చాయని చెప్పారు.

టపాచులాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ, “మేము రెండో అంతస్తులో ఉన్నప్పుడు భూకంపం మొదలైంది. మొదట ఆగిపోతుందని భావించాం. కానీ ప్రకంపనలు మరింత తీవ్రం కావడంతో వెంటనే కిందకు దిగి భవనం బయటకు వెళ్లాం” అని తెలిపారు. గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాలా సిటీలో కూడా భవనాలు బలంగా కంపించడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

ప్రస్తుతం అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉండటంతో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితిపై మెక్సికో, గ్వాటెమాలా ప్రభుత్వాలు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి…

Follow Us