AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahendragiri Varahi: సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ

చాలా గ్యాప్ తరవాత అక్కినేని సుమంత్ నటిస్తున్న సినిమా మహింద్రగిరి వారాహి. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ల కోసం వినూత్న పద్ధతులను అవలంభిస్తోంది చిత్ర బృందం.

Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ
Mahendragiri Varahi Movie
Basha Shek
|

Updated on: Jul 17, 2026 | 10:18 PM

Share

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో చిత్ర బృందం వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.

ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ థియేటర్‌లో తమ్ముడు లెనిన్ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తమౌతుంది. వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక గొప్ప అనుభూతి. దీనికి సహకరించిన మా నిర్మాతలు మధు గారికి, లక్ష్మణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే మా ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా మీ ముందుకు రాబోతోంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి, సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.”

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. “ప్రస్తుతం వారాహి గుప్త నవరాత్రులను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు చేరాలని, అలాగే మా సినిమా గురించి కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రీరాములు థియేటర్‌లో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నాం. అక్కడ నిరంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మా నిర్మాతలకు, హీరో సుమంత్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ…”వారాహి అమ్మవారి మహిమను మంచి కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మనందరికీ ఇష్టమైన హీరో సుమంత్ గారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఇందులో నేను కూడా ఒక మంచి పాత్ర పోషించాను. ప్రేక్షకులందరూ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. అమ్మవారి నేపథ్యంలో ఇలాంటి చిత్రం రావడం చాలా ప్రత్యేకం. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.”

వంశీ చాగంటి మాట్లాడుతూ…”అందరికీ నమస్కారం. చాలా మంచి సినిమా చేశాం. వారాహి అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా ఘనవిజయం సాధించాలని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత కలిపు మధు మాట్లాడుతూ…వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అదృష్టం మాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో నమ్మకంతో మంచి సినిమా తీశాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us