AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన.. ఎవరు చేశారంటే?

అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌పై భారీ రివార్డు ప్రకటించబడింది. డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చిన వారికి 10 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 83 కోట్లకు బహుమతిని అందిస్తామని ఇరాక్‌కు చెందిన ఓ సంస్థ ప్రకటించినట్టు ఇరాన్, రష్యాకు చెందిన ప్రభుత్వ వార్త సంస్థలు పేర్కొన్నాయి. ఈ నివేదికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Donald Trump: ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన.. ఎవరు చేశారంటే?
Donald Trump Bounty
Anand T
|

Updated on: Jul 17, 2026 | 10:35 AM

Share

ట్రంప్‌ను చంపేయండి.. 10 మిలియన్ డాలర్లు గెలుచుకోండని.. ఇరాక్‌కు చెందిన ఓ సంస్థ ప్రకటించినట్టు ఇరాన్‌, రష్యాకు చెందిన ప్రభుత్వ వార్త సంస్థలు పేర్కొన్నాయి. తాము ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ గ్రూప్‌నకు చెందినవాళ్లమని చెప్పుకున్న ఒక సాయుధ బృందం గురువారం జూలై 16 ఈ ప్రకటన జారి చేసినట్టు నివేదికలు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాద సంస్థతో పోరాడుతూ మరణించిన తమ కమాండర్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఆసంస్థ పేర్కొన్నట్టు తెలిపాయి. ట్రంప్ వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా ఉన్నాయని.. అందుకే అతనిపై రివార్డు ప్రకటించినట్టు స్పష్టం చేశాయి.

అయితే, ఈ బహుమతి సొమ్మును ఎలా అందజేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇర్నా కానీ, ఆర్టీ కానీ తమ కథనాల్లో వెల్లడించలేదు. అంతేకాకుండా, సాయుధ బృందం విడుదల చేసిన ఈ ప్రకటనను ఏ ఇతర స్వతంత్ర సంస్థలూ అధికారికంగా నిర్ధారించలేదు. గత కొంతకాలంగా అమెరికా, ఇరాన్, వాటి మద్దతు ఉన్న ఇతర సాయుధ బృందాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ప్రకటన రావడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు, ఈ వార్తలపై అమెరికాకు చెందిన కన్జర్వేటివ్ కార్యకర్త లారా లూమర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాకీ సాయుధ బృందం ప్రకటించిన రివార్డును రష్యా ప్రభుత్వ ఎందుకు ప్రచారం చేస్తుందని మండి పడ్డారు. రష్యా ఎందుకు మనకు మిత్రదేశం కాదో చెప్పడానికి ఇలాంటి ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!