హైటెక్ దొంగల పుట్టుకోచ్చారోచ్.. ఏకంగా ఏఐ డేటా సెంటర్లే టార్గెట్.. ఏం ఎత్తుకెళ్లారంటే..!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, ఏఐ డేటా సెంటర్ల నిర్మాణాలకు సంబంధించిన ఖరీదైన సామగ్రి ఇప్పుడు దొంగల ముఠాలకు ప్రధాన లక్ష్యంగా మారుతోంది. సాధారణంగా నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా రిటైల్ ఉత్పత్తులను టార్గెట్ చేసే నేరగాళ్లు ఇప్పుడు ఏఐ మౌలిక సదుపాయాలపై కన్నేశారు. AI కోసం ఉపయోగించే హై-వాల్యూ టెక్నాలజీ పరికరాలపై దృష్టి సారించడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ కొత్త ట్రెండ్‌కు నిదర్శనంగా నిలిచింది.

చికాగో సమీపంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు దొంగిలించిన కంటైనర్లలో మొత్తం 1.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లకు పైగా) విలువైన ఏఐ డేటా సెంటర్ల నిర్మాణ సామగ్రి లభించింది. దర్యాప్తులో ఈ సామగ్రి వేర్వేరు రాష్ట్రాల నుంచి చోరీ చేసినట్లు గుర్తించారు. ఒక కంటైనర్‌లో అలబామా నుంచి దొంగిలించిన సుమారు 3 లక్షల డాలర్ల విలువైన కాపర్ వైర్లు ఉండగా, మరో ట్రైలర్‌లో ఫ్లోరిడా నుంచి ఎత్తుకెళ్లిన 1 మిలియన్ డాలర్ల విలువైన ప్రత్యేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరికరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్థాయిలో ఖరీదైన టెక్నాలజీ సామగ్రిని లక్ష్యంగా చేసుకోవడం దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కార్గో దొంగతనాల్లో ఇప్పుడు కొత్త ధోరణి కనిపిస్తోంది. ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన కాపర్ కేబుల్స్, సర్వర్లు, ఎలక్ట్రికల్ గేర్, పవర్ డిస్ట్రిబ్యూషన్ పరికరాలు వంటి వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ కారణంగా వాటిని దొంగిలించి అక్రమ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా నేరగాళ్లు భారీగా లాభాలు ఆర్జించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఈ నిర్మాణాలకు అవసరమైన పరికరాలు సరఫరా అయ్యే ప్రతి దశలో భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఏర్పడింది. సప్లై చెయిన్‌లో చిన్న భద్రతా లోపం కూడా ప్రాజెక్టుల ఆలస్యానికి, ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. రవాణా సమయంలో జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేయడం, ప్రతి పరికరానికి ప్రత్యేక సీరియల్ నంబర్లు కేటాయించడం, లాజిస్టిక్స్ నిర్వహణలో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయడం, అనుమానాస్పద కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏఐ టెక్నాలజీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో, దానికి అవసరమైన మౌలిక సదుపాయాల భద్రత కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. హైటెక్ పరికరాలపై దొంగల కన్ను పడుతున్న నేపథ్యంలో, టెక్ కంపెనీలు తమ సప్లై చెయిన్ భద్రతను మరింత బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి దొంగతనాలు పరిశ్రమకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..