AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్జెంటీనా vs స్పెయిన్.. ఫిఫా వరల్డ్ కప్ ఎవరు గెలిస్తే భారత్‌కు మంచిది? ఈ ఇంట్రెస్టింగ్ లింక్ తెలుసా?

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్, అర్జెంటీనా vs స్పెయిన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం 2027 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమిండియా భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని అభిమానుల్లో సెంటిమెంట్ బలంగా ఉంది. గత రికార్డుల ఆధారంగా స్పెయిన్ గెలిస్తే భారత్‌కు అదృష్టం, అర్జెంటీనా గెలిస్తే దురదృష్టం అని నమ్ముతున్నారు.

అర్జెంటీనా vs స్పెయిన్.. ఫిఫా వరల్డ్ కప్ ఎవరు గెలిస్తే భారత్‌కు మంచిది? ఈ ఇంట్రెస్టింగ్ లింక్ తెలుసా?
Fifa And Team India
SN Pasha
|

Updated on: Jul 17, 2026 | 4:11 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20న ఈ మెగా సమరం జరగనుంది. వరల్డ్ కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, అలాగే స్పెయిన్ జట్లు తలపడుతున్నాయి. ప్రాణాలు పెట్టి ఆడి, హేమాహేమీ జట్లను మట్టికరిపించి ఈ రెండు టీమ్స్ తుది పోరుకు రెడీ అయ్యాయి. అయితే మన దేశంలో ఫుట్‌బాల్‌కు అంత ఆదరణ లేకపోయినా.. ఫైనల్ మ్యాచ్ కావడంతో కొంతమంది కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలోని వెస్ట్ బెంగాల్, కేరళం రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌కు క్రేజ్ బాగానే ఉంది.

ఆ విషయం అటుంచితే.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా, స్పెయిన్.. ఒక టీమ్ గెలిస్తే టీమిండియా కలిసి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. క్రీడల్లో సెంటిమెంట్‌ను అభిమానులు బలంగా నమ్ముతారనే విషయం తెలిసిందే. అయితే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. స్పెయిన్ గెలిస్తే టీమిండియాకు అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. ఇంతకీ స్పెయిన్ వరల్డ్ కప్ గెలవడం టీమిండియాకు ఎలా కలిసి వస్తుందనే డౌట్ రావొచ్చు. దాని వెనుక ఒక స్టోరీ ఉంది. అదేంటంటే..

2011 గుర్తందా..? క్రికెట్ అభిమానులు అస్సలు మర్చిపోలేని ఏడాది అది. ధోని కెప్టెన్సీలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఏడాది. సచిన్ చిరకాల కోరిక తీరిన ఏడాది, దాన్ని ఎలా మర్చిపోతాం అంటారా? నిజమే. అది మనకు ఎంతో మధురమైన ఏడాది. అయితే చివరి సారిగా అంటే 2010లో స్పెయిన్ ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది. ఆ మరుసటి ఏడాదే టీమిండియా కూడా క్రికెట్‌లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అలాగే అర్జెంటీనా చివరి సారి 2022లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2023లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఓడిపోయింది. సో.. ఇప్పుడు అంటే ఈ 2026లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా గెలిస్తే.. టీమిండియా 2027 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోతుందని, అదే స్పెయిన్ గెలిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ మనదే అని కొంతమంది ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. వినేందుకు విచిత్రంగానే ఉన్నా.. స్పోర్ట్స్‌లో సెంటిమెంట్స్‌కు బలమైన మద్దతు ఉంటుంది. మరి చూడాలి. ఏం జరుగుతుందో..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us