AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిల మిల మెరిసే చర్మం కోసం రోస్ వాటర్..ఎలా తయారు చేయాలంటే?

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్త్రీ, పురుషులిద్దరూ కూడా తమ ముఖ సౌదర్యం కాపాడుకోవడం కోసం నిత్యం గులాబీ రోస్ వాటర్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనిని వాడటం వలన చర్మం కాంతివంతంగా తయారు అవ్వడమే కాకుండా, ముఖ సౌందర్యం పెరుగుతుంది. కాగా, ఇప్పుడు మనం రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 17, 2026 | 3:03 PM

Share
చాలా మంది ఎక్కువగా బయట రోజ్ వాటర్ కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇవి ఎక్కువగా రసాయనాలు కలిపి ఉంటాయి. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే సహజంగా రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. కేవలం గులాబీ రేకులు, శుద్ధి చేసిన నీరు, ఐస్ క్యూబ్స్‌తో చాలా సులభంగా, ఇంటిలోనే కెమికల్స్ లేని రోజ్ వాటర్ తయారు చేసుకోవచ్చనంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5
రోజ్ వాటర్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. వెడల్పాటి బౌల్ తీసుకొని, వాటి చుట్టూ గులాబీ రేకులను పేర్చాలి. తర్వాత మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టాలి. గులాబీ రేకులు మునిగే వరకు గిన్నె చుట్టూ నీరు పోయాలి. ఈ నీరు మాత్రం మధ్యలో ఉన్న గిన్నెలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఇప్పుడు దానిపై ప్లేట్ ఆకారంలో ఉండే మూతను పెట్టాలి.

2 / 5
ఆ పైన పెట్టిన మూతపైన ఐస్ క్యూబ్స్ పెట్టాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి,  నీళ్లు బాగా మరిగేలా చూసుకోవాలి. ఇప్పుడు నీరు మరుగుతూ ఉంటాయి. గులాబీలోని పోషకాలు అన్నీ కూడా ఆవిరి రూపంలో పైకి వస్తాయి. మూతపై ఉన్న ఐస్ క్యూబ్స్ ఆ ఆవిరిని చల్లార్చి, తిరిగి నీటి బిందువులగా మార్చి, ఘనీభవించేలా చేస్తాయి.

3 / 5
ఆ నీటి బిందువులు, బౌల్ మధ్యలో ఉంచిన, గిన్నలో పడతాయి. ఆ నీరే రోజ్ వాటర్. ఇవి 100 శాతం స్వచ్ఛమైన గులాబీ, రోజ్ వాటర్. ఎలాంటి రసాయనాలు లేకుండా రోజ్ వాటర్‌ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చును. మీరు ఒక వేళ గులాబీ వాటర్ తయారు చేసి వెంటనే ఉపయోగించుకోవాలి అంటే, ఈ చిట్కాలు పాటించాలి.

4 / 5
ఒక పాత్రలో నీళ్లు పోసి, గులాబీ రేకులు వేసి దాదాపు 20 నిమిషాల పాటు మరిగించాలి. గులాబీ రేకులు పూర్తిగా వాడిపోయి, నీళ్ల రంగు మారిపోవాలి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ నీరు చల్లారిన తర్వాత వాటిని వడకట్టి, ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. తర్వాత వీటిని మీరు వెంటనే ఉపయోగించుకోవచ్చు.

5 / 5
Follow Us
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?

ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!

ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..

రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?

ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..

ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..

కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?

‌52 సిక్సర్లతో 892 పరుగులు.. సూర్య రికార్డ్‌పై కన్నేసిన ఇషాన్..!