AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Astrology: ఆ రాశులకు బుధుడి కటాక్షం.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!

Mercury Turns Direct in Gemini: జూలై 23 నుంచి బుధుడు వక్రగతి నుంచి బయటపడి స్వక్షేత్రమైన మిథున రాశిలో సవ్యదిశలో సంచారం ప్రారంభించనున్నాడు. ఈ మార్పు వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి ఆదాయ మార్గాలు విస్తరించి, ఆర్థిక లాభాలు పెరిగి, బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 3:03 PM

Share
ప్రస్తుతం తన స్వక్షేత్రమైన మిథున రాశిలో వక్ర సంచారం చేస్తున్న బుధ గ్రహం ఈ నెల 23న వక్ర గతి నుంచి బయటపడి సవ్య దిశలో సంచారం చేయడం జరుగుతోంది. బుధుడు రుజు మార్గంలో ఆగస్టు 5 వరకు కొనసాగి, ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వంటి అదనపు ఆదాయ మార్గాలకు కారకుడైన బుధుడు స్వక్షేత్రంలో రుజు మార్గంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు అనేక విధాలుగా ఆదాయ మార్గాల్ని  అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. బుద్ధి కారకుడైన బుధుడు వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులకు బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచడం జరుగుతుంది.

1 / 7
వృషభం: ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడికి ధన స్థానంలో బలం పెరగడం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అదనపు ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా మారుతుంది. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్మును కొద్ది ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు. ఆస్తిపాస్తుల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. విదేశీ సంపాదన అనుభవించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు అంచనాలకు మించి లాభిస్తాయి.

2 / 7
మిథునం: రాశ్యధిపతి బుధుడికి ధన స్థానంలో బలం, వేగం పెరగడం వల్ల ఈ రాశివారికి అతి తక్కువ శ్రమతో అత్యధికంగా ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. ఇతర సంస్థలకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. అద్దెల ఆదాయంతో పాటు, కౌన్సెలింగ్, మధ్యవర్తిత్వాల వల్ల కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది.

3 / 7
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి బుదుడి సంచారం వల్ల ఆగస్టు 5 వరకు ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, అదనపు రాబడికి బాగా అవకాశం ఉంది. ఆదా యాన్ని అనేక విధాలుగా మదుపు చేసి లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా లాభిస్తాయి.

4 / 7
కన్య: రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో బాగా బలం పుంజుకోవడం వల్ల అదనపు ఆదాయ మార్గా లన్నీ బాగా లాభిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. నైపుణ్యాలనన్నిటినీ ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. షేర్లు,  స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు వగైరాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి.

5 / 7
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడి సంచారం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కూడా బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారమ వుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. అద్దెల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు, బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్లు. వడ్డీ వ్యాపారాలతో సహా అనేక విధాలుగా అదనపు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

6 / 7
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడి సంచారం వల్ల షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభించే అవకాశం ఉంది. పొదుపులు, మదుపులు వృద్ది చెందుతాయి. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. అదనపు ఆదాయాన్ని పెంచుకుంటారు. కుటుంబపరంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును, బాకీలు, బకాయిలను కొద్ది ప్రయత్నంతో వసూలు చేసుకుం టారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేయడం వల్ల కూడా లాభాలు కలుగుతాయి.

7 / 7
Follow Us