పొద్దున్నే ఈ నీళ్లు గ్లాసుడు తాగితే.. కిడ్నీ స్టోన్స్ ప్రమాదం లేనట్లే!

17 July 2026

TV9 Telugu

TV9 Telugu

కొబ్బరి నీళ్లలో దాదాపు 94 శాతం పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాల సమతుల్యతను పునరుద్ధరిస్తాయి

TV9 Telugu

పరగడుపున టీ లేదా కాఫీపై ఆధారపడకుండా వీటితో  రోజును ప్రారంభించాలనుకునేవారికి కొబ్బరి నీరు మంచి ప్రత్యామ్నాయం

TV9 Telugu

ఇందులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, ఎలక్ట్రోలైట్లు శరీరానికి నెమ్మ‌దిగా శక్తిని అందించి అలసటను తగ్గించడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఉదయం కొబ్బరి నీటిని తాగడం జీర్ణవ్యవస్థను మృదువుగా చురుకుగా మార్చడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఇందులో ఉండే సహజ ఎంజైమ్‌లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు జీర్ణక్రియను ప్రోత్సహించడమే కాకుండా మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి

TV9 Telugu

అలాగే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి

TV9 Telugu

పరగడుపున తాగితే పొటాషియం శరీరంలో మరింత సమర్థంగా శోషించబడే అవకాశం ఉంటుంది. సమతుల ఆహారంతో పాటు వీటిని మితంగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికీ మేలే

TV9 Telugu

సహజ డిటాక్స్ పానీయంగా పేరుగాంచిన కొబ్బరి నీరు మూత్ర విసర్జనను ప్రోత్సహించడం ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి