AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడవనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రతిరోజూ 356 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు ఉంటాయి. దీని తర్వాత, మరిన్ని ఇతర మార్గాల్లో కూడా రైళ్లను నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి..

Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
Hydrogen Train
Subhash Goud
|

Updated on: Jul 17, 2026 | 3:39 PM

Share

Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభమైంది. దీనికి విద్యుత్తు గానీ, డీజిల్ ఇంధనం గానీ అవసరం లేదు. ఈ రైలు కేవలం నీటితోనే నడుస్తుంది. ఇది చూడటానికి విభిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఈ అత్యాధునిక రైలు ఛార్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసా? కేవలం ఐదు రూపాయలు. నమ్మడం లేదా.. నిజమే.

హైడ్రోజన్ రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది?

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడవనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రతిరోజూ 356 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు ఉంటాయి. దీని తర్వాత, మరిన్ని ఇతర మార్గాల్లో కూడా రైళ్లను నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి.

ఈ రైలులో ఏముంది?

  • ఈ నీలి రంగు రైలు పూర్తిగా ఏసీ సౌకర్యంతో ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ డోర్స్‌, ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి.
  • ఇది ఎంత మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు?
  • ఈ హైడ్రోజన్ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు మొత్తం 2,600 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలదు. మధ్యలో 11 స్టాప్‌లు ఉంటాయి.

ఈ రైలు ఎంత వేగంగా వెళ్తుంది?

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్‌తో నడిచే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి రైలు గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

హైడ్రోజన్ రైలుకు ఎంత ఖర్చు అవుతుంది?

హైడ్రోజన్ రైలు ఛార్జీలో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. కనీస ఛార్జీని కేవలం 5 రూపాయలు నిర్ణయించారు. గరిష్ట ఛార్జీ 25 రూపాయల వరకు ఉంటుంది. అంటే, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ కంటే హైడ్రోజన్ రైలు టిక్కెట్ చౌకగా ఉంది. ఈ రైలు టిక్కెట్లను IRCTC వెబ్‌సైట్ నుండి, రైల్వే కౌంటర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. జింద్ నుండి సోనిపత్ కు దూరం 89 కిలోమీటర్లు. జింద్ నుండి సోనిపత్ చేరుకోవడానికి కేవలం రెండు గంటల సమయం పడుతుంది.

ఇది కూడా చదవండి: Kitchen Hacks: ఇన్ని రోజులు ఈ ట్రిక్‌ తెలియకపాయే.. ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు.. వైరల్‌ వీడియో!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..