AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎలా వస్తాయ్‌ బ్రో ఇలాంటి ఐడియాలు.. ఏటీఎం క్యాబిన్‌ ను ఇలా కూడా వాడుకోవచ్చా ? వీడియో చూస్తే అవాక్కే..!

ఉత్తరప్రదేశ్‌లో ఎండలు ఏ స్థాయిలో దంచి కొడుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. భానుడి భగభగలకు, ఉక్కపోతకు తట్టుకోలేక ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన దేశీ జుగాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎండలు, ఉక్కపోతకు తట్టుకోలేక సదరు వ్యక్తి అదిరిపోయే ఐడియా వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది!అదేంటంటే..

Viral Video: ఎలా వస్తాయ్‌ బ్రో ఇలాంటి ఐడియాలు.. ఏటీఎం క్యాబిన్‌ ను ఇలా కూడా వాడుకోవచ్చా ? వీడియో చూస్తే అవాక్కే..!
Atm Or Bedroom
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2026 | 4:10 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా, భిటి తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక యువకుడు రెండు ఎయిర్ కండిషనర్ల చల్లని గాలికి ఎస్‌బిఐ ఏటిఎమ్‌లో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తాడు. అతను ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే, పారదర్శకమైన గాజు తలుపు ఉన్నప్పటికీ, తెల్లవారిన విషయాన్ని కూడా గమనించలేదు. శుక్రవారం ఉదయం ఏటిఎమ్ నుండి డబ్బులు విత్‌డ్రా చేయడంలో ఇబ్బంది పడిన కొందరు వ్యక్తులు ఈ వీడియోను రికార్డ్‌ చేసి వైరల్ చేశారు. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగుచూసింది. రాత్రి పూట ఇంట్లో ఉక్కపోతను భరించలేకపోయిన ఒక వ్యక్తి.. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం సెంటర్‌ను తన బెడ్‌రూమ్‌గా మార్చేసుకున్నాడు. ఏటీఎం క్యాబిన్‌లో ఏసీ ఫుల్లుగా వస్తుండటంతో, హాయిగా అక్కడే బెడ్‌షీట్ పరుచుకుని రాత్రంతా నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన కొందరు కస్టమర్లు లోపల వ్యక్తి పడుకుని ఉండటం చూసి అవాక్కయ్యారు. క్యాబిన్ లోపల ఎంచక్కా నిద్రపోతున్న సదరు వ్యక్తిని కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షం కావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయుల జుగాడ్ ఆలోచనలకు ఆకాశమే హద్దు అని కొందరు కామెంట్ చేస్తుంటే, రాత్రి వేళల్లో ఏసీ బిల్లులు కట్టలేని సామాన్యుడి కష్టానికి ఇది నిదర్శనం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ కూల్ ఐడియా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!