Restaurant Bans Phones: ఈ రెస్టారెంట్‌లో తినేప్పుడు ఫోన్ వాడకం నిషేధం.. ఎందుకో తెలుసా..?
స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక తిన్నా, పడుకున్నా, నడుస్తున్నా.. చివరికి వాష్‌రూంకి వెళ్లినా ఫోన్ పట్టుకుని వెళ్లిపోతున్నారు. అంతగా మన జీవన శైలిలో ఫోన్లు భాగమైపోయాయి. ఇలాంటి అలవాటుకు చెక్ పెట్టేందుకు ఓ రెస్టారంట్ వింత షరతు పెట్టింది..
స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక తిన్నా, పడుకున్నా, నడుస్తున్నా.. చివరికి వాష్‌రూంకి వెళ్లినా ఫోన్ పట్టుకుని వెళ్లిపోతున్నారు. అంతగా మన జీవన శైలిలో ఫోన్లు భాగమైపోయాయి. ఇలాంటి అలవాటుకు చెక్ పెట్టేందుకు జపాన్‌లోని ఓ రెస్టారంట్ వింత షరతు పెట్టింది. కనీసం భోజనమైనా మనసారా తినాలని వినూత్న షరతు పెట్టింది. అదేంటంటే తమ రెస్టారెంట్‌లో ఆహారం తినే కస్టమర్లు భోజనం చేసే సమయంలో ఫోన్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు హుకూం జారీ చేసింది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ వింత కండిషన్ సర్వత్రా చర్చణీయాంశమైంది. వివరాల్లోకెళ్తే..
జపాన్ రాజధాని అయిన టోక్యోలో డెబు-చాన్ అనే రెస్టారంట్ చాలా ఫేమస్. అక్కడికి వచ్చే వినియోగదారులు తినే సమయంలో కూడా ఫోన్లతో బిజీగా ఉండడాన్ని నిర్వాహకులు గమనించారు. వేడివేడిగా ఆహారం వడ్డించిన తర్వాత కూడా ఓ కస్టమర్ తినకుండా ఫోన్‌లో నిమగ్నమై ఉండటాన్ని ఆ రెస్టారెంట్ యజమాని గమనించాడు. ఇలా ఆలస్యం చేయడం వల్ల ఆహారం రుచి, నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే రెస్టారెంట్ పీక్ అవర్స్‌లో మొత్తం 33 సీట్లు నిండిపోగా.. కనీసం 10 మందైనా సీట్ల కోసం లైన్‌లో వెయిట్ చేస్తున్నారని యాజమన్యం గ్రహించారు. ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని, అందువల్లనే కస్టమర్లు భోజనం చేసే సమయంలో ఫోన్ వాడకంపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు యజమాని వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.