Thames River Freeze: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న చలిగాలులు .. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా గడ్డకట్టిన థేమ్స్‌ నది

ఓవైపు కరోనా ఇంగ్లాండ్ ను వణికిస్తోంది.. మరోవైపు చలిపులి చంపేస్తోంది. అక్కడ గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అక్కడ కురుస్తున్న మంచు వర్షంతో సౌత్‌ కుంబ్రియాలోని...

Thames River Freeze: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న చలిగాలులు .. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా  గడ్డకట్టిన థేమ్స్‌ నది
Follow us

|

Updated on: Feb 14, 2021 | 3:20 PM

Thames River Freeze: ఓవైపు కరోనా ఇంగ్లాండ్ ను వణికిస్తోంది.. మరోవైపు చలిపులి చంపేస్తోంది. అక్కడ గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అక్కడ కురుస్తున్న మంచు వర్షంతో సౌత్‌ కుంబ్రియాలోని అల్డింగ్‌హమ్‌ బీచ్‌ గడ్డకట్టుకుపోయింది. అంతేకాదు సౌత్‌ వెస్టు లండన్‌లోని టెడింగ్టన్‌ వద్ద థేమ్స్‌ నది కూడా మంచుముద్దగా మారిపోయింది. నీరు మొత్తం గడ్డ కట్టి మంచు ముక్కలా మారిపోయింది. దీంతో అక్కడ సముద్రపు పక్షులు సందడి చేస్తున్నాయి. ఇక పర్యాకులు కూడా థేమ్స్ నదిని చూడడానికి క్యూ కట్టారు. అంతేకాదు 60 సంవత్సరాల తర్వాత థేమ్స్‌ నది గడ్డకట్టిందని చెప్పారు.

ఇక ఇంగ్లాండ్ లో ముఖ్య నగరాలైన రావెన్స్‌వర్త్, నార్తు యార్క్‌షైర్‌లో మైనస్‌ 15.3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంచు వర్షంతో రహదారులు, వీధులు మంచు ముద్దలుగా మారిపోయాయి. అక్కడ గంటకు 50 కి. మీ వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. కేంబ్రిడ్జిషైర్‌లోని గ్రేట్‌ ఔసీ నదిలో పడవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read:

హిమాలయాలకు మనుషులు చేస్తోన్న గాయం… పెను ప్రమాదంలో ఉత్తరాఖండ్ లోని మూడొంతుల ప్రాంతం

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని. నరేంద్ర మోదీ.. రైతన్నలపై కీలక వ్యాఖ్యలు..