Uttarakhand Risk of Glacial Floods :హిమాలయాలకు మనుషులు చేస్తోన్న గాయం… పెను ప్రమాదంలో ఉత్తరాఖండ్ లోని మూడొంతుల ప్రాంతం

హిమాలయాల పరిసర ప్రాంతాలను దేవతలు సంచరించే భూమి అని హిందువులు భావిస్తారు.. అయితే గత కొంత కాలంగా మనుషులు సృష్టిస్తున్న కాలుష్యానికి ఆ దేవ భూమి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇటీవల ఉత్తరాఖండ్ లో సంభవించిన...

Uttarakhand Risk of Glacial Floods :హిమాలయాలకు మనుషులు చేస్తోన్న గాయం...  పెను ప్రమాదంలో ఉత్తరాఖండ్ లోని మూడొంతుల ప్రాంతం
Surya Kala

|

Feb 14, 2021 | 2:54 PM

Uttarakhand Risk of Glacial Floods :హిమాలయాల పరిసర ప్రాంతాలను దేవతలు సంచరించే భూమి అని హిందువులు భావిస్తారు.. అయితే గత కొంత కాలంగా మనుషులు సృష్టిస్తున్న కాలుష్యానికి ఆ దేవ భూమి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇటీవల ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదలు ప్రారంభం మాత్రమేనని.. ఇలాగేకొనసాగితే.. దేవభూమి ఉత్తరాఖండ్ లో మూడొంతులు ప్రమాదంలో పడనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిమాలయ పర్వత శ్రేణుల్లో భారత్‌వైపు సుమారు 5వేల హిమానీనదాలు ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. వీటిల్లో ఉత్తరాఖండ్‌లో ఉన్న 500కుపైగా హిమానీనదాలు ఎప్పుడైనా కరిగి ఉత్తరాఖండ్ ను ముంచేయవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో ఉన్న 26 తాలూకాలు ఈ హిమానినాదాల వరద ముప్పు పొంచి ఉందని .. వాటిల్లో భాట్‌వాఢీ, జోషిమఠ్, ధార్చులా ల ప్రాంతాల్లో వరదల బీభత్సం సృష్టించే అవకాశం ఉందని నిఫుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రోజు రోజుకీ వాతావరణం లో చోటు చేసుకుంటున్న మార్పులతో భూతాపం పెరుగుతోందని.. దీంతో మంచు కొండలు కరిగి సరస్సులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ సరస్సులు వాతావరణంలో కలిగే మార్పుల ఫలితాలుగా ఒక్కసారిగా కట్టలు తెంచుకుని కింద ప్రాంతాలకు వరదలుగా దూసుకొచ్చి విధ్వంసం సృస్తిస్తున్నాయని ఓ నివేదికలో వెల్లడయ్యింది. ఇలాంటి మంచునీటి తటాకాలు 1990-2018 మధ్య 48% పెరిగినట్లు నేచర్‌ జర్నల్‌ నివేదిక పేర్కొంది.

హిమాలయ పరిసరప్రాంతాల్లో అమరనాథ్ , బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ ధామ్, మానస సరోవర యాత్రల పేరుతో ఏటా లక్షలాదిమంది పర్యాటకులు హిమాలయ శ్రేణులకు వస్తుండడంతో అక్కడ పర్యాటక రంగం భారీగా విస్తరించింది. అక్కడ ఏర్పాటు చేస్తోన్న వసతి సదుపాయాలు, వాహనాల రాకపోకలు, అడవుల నరికివేత వీటితో పాటు. అక్కడ నదులపై నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు హిమాలయాలను కాలుష్య కోరల్లోకి నెట్టేశాయి. ముఖ్యంగా 2000 నుంచి 2016 మధ్య హిమాలయాల్లో భూతాపం 0.4 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 1.4 డిగ్రీల సెల్సియస్‌ పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 10వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం సుమారు 70కిపైగా జలవిద్యుత్తు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవన్నీ కలిపి ప్రకృతి లో అనేక విపత్తులకు కారణం అవుతున్నాయి.

మరి దేవభూమిని, హిమాలయాల పర్వత శ్రేణులను రక్షించుకోవాల్సిన భాద్యత ప్రతిఒక్కరి పైనా ఉంది… అంతేకాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అక్కడ కాలుష్యకారకాలపై నిషేధం విధిస్తే.. ఉత్తరాఖండ్ కు ముప్పు తప్పుతుందని పర్యావరణ నిపుణులు చెప్పారు.

Also Read:

తమిళనాడులో పర్యటిస్తున్న మోదీ.. రైతన్నలపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని..

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన భద్రతాదళాలు.. భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu