Thai Pro Democracy Protesters:రాచ పరువు చట్టాలకు నిరసనగా..థాయిలాండ్‌లో మళ్ళీ రోడెక్కిన ప్రజాస్వామ్య ఆందోళనకారులు..
థాయిలాండ్ లో మళ్ళీ ప్రజలు రోడెక్కారు. బ్యాంకాక్ స్మారకం వద్ద వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ.. నిరసనలు చేపట్టారు. రాజ పరువు నష్టం చట్టాలను రద్దు చేయాలని ఆందోళనకారులు...
Thai Pro Democracy Protesters:థాయిలాండ్ లో మళ్ళీ ప్రజలు రోడెక్కారు. బ్యాంకాక్ స్మారకం వద్ద వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ.. నిరసనలు చేపట్టారు. రాజ పరువు నష్టం చట్టాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాజభవనం వద్దకు మార్చ్ గా వెళ్ళడానికి ఆందోళన కారులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ ఛాన్ ఓచా ప్రభుత్వంలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ యువత నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది.
కరోనా సమయంలో తీవ్రత తగ్గిన ఉద్యమం ఇటీవల ఉద్యమానికి చెందిన నలుగురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన తిరిగి ప్రారంభమైంది. వీరిని రాచరికాన్ని అవమానించారన్న ఆరోపణతో అరెస్ట్ చేశారు. వీరిపై లెసే మేజెస్టీ చట్టం ప్రకారం అభియోగాలు మోపారు. ఈ చట్టం ప్రకారం నిందితులు దోషులుగా తేలితే 15 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. చట్టంలోని 112 సెక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు జరుగుతున్నాయని పాన్‌పాంగ్ మైక్ జడ్నోక్ చెప్పారు.
Also Read: