Tipping in New York: తనకు సర్వ్ చేసిన వెయిట్రెస్ కు దాదాపు రూ. 9 లక్షల టిప్ .. ఎక్కడంటే..!
ఎవరైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు తమకు సర్వీస్ చేసిన వారికి టిప్ ఇవ్వడం సర్వసాధారణం.. అయితే కొన్ని సార్లు.. తమకు సర్వ్ చేసిన వెయిటర్లకు భారీగా టిప్ ఇచ్చిన వార్తలు కూడా వింటున్నాం.. అటువంటి ఘటన ఒకటి అమెరికాలో
Tipping in New York: ఎవరైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు తమకు సర్వీస్ చేసిన వారికి టిప్ ఇవ్వడం సర్వసాధారణం.. అయితే కొన్ని సార్లు.. తమకు సర్వ్ చేసిన వెయిటర్లకు భారీగా టిప్ ఇచ్చిన వార్తలు కూడా వింటున్నాం.. అటువంటి ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. న్యూ యార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి సహాయం చేయడానికి రాబిన్ స్కాల్ ముందుకొచ్చారు. తన సోషల్ మీడియా వేదికగా ఆ యువతికి సాయం చేయాలని పిలుపునిచ్చారు.. దీంతో ఏకంగా లక్షల రూపాయలు పోగయ్యాయి. ఆ టిప్ ను వెయిట్రెస్ కు ఇచ్చి అవాక్కు చేశారు. వివరాల్లోకి వెళ్తే.
View this post on Instagram
న్యూయార్క్ లో లిల్లీస్ కాక్ టైల్ రెస్టారెంట్ లో ఓ హోటల్ ఉంది.. ఆ హోటల్ కు రెగ్యులర్ గా వెళ్లే రాబిన్ స్కాల్ అనే కస్టమర్, వెయిట్రెస్ గా పనిచేస్తున్న ఉల్యానా హ్రుచాక్ అనే యువతిని చూశారు. ఆమెకు ఏదైనా సహాయం చేయాలనీ భావించారు. తనఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని కోరారు.. ఆమె పోస్టు కు స్పందించిన అభిమానులు తమకు తోచిన సాయం అందించారు.. అయితే క్షణాల్లోనే 13వేల డాలర్లు అంటే మన కరెన్సీ లో దాదాపు రూ. 9.42 లక్షలు పోగయ్యాయి. దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లి ఆ మొత్తాన్ని వెయిట్రెస్ ఉల్యానా హ్రుచాక్ కు టిప్ గా ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన ఉల్యానా హ్రుచాక్ తనకు సాయం చేసిన రాబిన్ స్కాల్ తో పాటు ఆమె ఫాలోవర్స్ కు కూడా కృతజ్ఞలు తెలిపింది.
Also Read: