భారత సంతతి అమెరికన్లకు గొప్ప అవకాశం.. మరో ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించిన అధ్యక్షులు జో బైడెన్

ప్రజాసేవల విభాగంలో నిపుణులైన ఇద్దరు భారతీయ-అమెరికన్లను బైడెన్‌ కీలక పదవుల్లో నియమించారు. సోనాలీ నిజ్వాన్‌, శ్రీ ప్రిస్టన్‌ కులకర్ణిలకు కీలక బాధ్యతలు.

భారత సంతతి అమెరికన్లకు గొప్ప అవకాశం.. మరో ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించిన అధ్యక్షులు జో బైడెన్
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 15, 2021 | 3:31 PM

Biden appoints 2 Indian-origin experts : అమెరికాకు నూతన అధ్యక్షుడు జో బైడెన్ కొత్త మంత్రివ‌ర్గంలో మరో ఇద్దరు భార‌తీయ అమెరిక‌న్లకు చోటు ద‌క్కింది. ఎన్నిక‌లకు వెళ్లడానికంటే ముందుగానే బైడెన్‌కు అడ్వైజ‌ర్‌గా ప‌నిచేసిన వివేక్ మూర్తికి ఇప్పటికే మంత్రివ‌ర్గంలో చోటు కల్పించగా, తాజాగా ప్రజాసేవల విభాగంలో నిపుణులైన ఇద్దరు భారతీయ-అమెరికన్లను బైడెన్‌ కీలక పదవుల్లో నియమించారు. స్వచ్ఛంద సేవకు సంబంధించిన ఫెడరల్‌ ఏజెన్సీ ‘అమెరికార్ప్స్‌’కు జాతీయ వ్యవహారాల డైరెక్టర్‌గా సోనాలీ నిజ్వాన్‌ నియమితులయ్యారు. మరో భారతీయ అమెరికన్‌ శ్రీ ప్రిస్టన్‌ కులకర్ణి.. విదేశీ వ్యవహారాల సారథిగా నియమించారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికన్‌ కాంగ్రెస్‌కు టెక్సాస్‌ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూసినప్పటికీ కులకర్ణికి ఈ గుర్తింపు దక్కడం విశేషం.

ఇదీ చదవండి… కోయంబత్తూరులో ఘనంగా సామూహిక వివాహాలు.. వధూవరులకు పెళ్లి బట్టలు, గృహ సామాగ్రి అందజేసీన సీఎం పళనిస్వామి