పసుపు, గులాబీ రంగులలో కాలీఫ్లవర్ల్స్ పండించిన మహారాష్ట్ర రైతు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్…

సాధరణంగా కాలీఫ్లవర్స్ అంటే తెలుపు రంగులో మాత్రమే ఉంటాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కాలీఫవర్లను ఏకంగా పుసుపు, పర్పుల్ రంగులలో

పసుపు, గులాబీ రంగులలో కాలీఫ్లవర్ల్స్ పండించిన మహారాష్ట్ర రైతు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్...
Follow us

|

Updated on: Feb 15, 2021 | 3:10 PM

సాధరణంగా కాలీఫ్లవర్స్ అంటే తెలుపు రంగులో మాత్రమే ఉంటాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కాలీఫవర్లను ఏకంగా పుసుపు, గులాబీ రంగులలో వాటిని పండించాడు. అదేలనో తెలుసుకుందాం..

మహారాష్ట్ర.. నాసిక్ సమీపంలోని దభారీ గ్రామానికి చెందిన మహీంద్ర నికమ్ అనే రైతు తన చెన్లో పసుపు, గులాబీ రంగుల్లో హైబ్రీడ్ కాలీఫ్లవర్లను పండించాడు. “రెండు నెలల కిందట కాలీఫ్లవర్ విత్తనాలను రూ.40 వేలకు కొన్నాను. 30 గుంటలలో ఆ విత్తానాలు వేసాను. కానీ ఆ భూమి స్విట్జర్లాండ్ కంపెనీ సింజెంటా అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారిది. ఆ విత్తనాలు వేసాక.. ఇలా పసుపు, గులాబీ రంగుల్లో కాలీఫ్లవర్స్ పండాయి. వీటిని పండించడానికి నాకు ఎలాంటి ఖర్చు కాలేదు” అంటూ చెప్పుకొచ్చాడు మహీంద్రనికమ్.

నేను రెండు రకాల పంటలను పండించాను. వాటిలో గులాబీ రంగు, పసుపు రంగు కాలీఫ్లవర్స్ పండాయి. వీటి రంగు మరియు పోషకాల విలువలతో వీటిని మెట్రో నగరాల నుంచి అధిక డిమాండ్ వస్తుంది అని తెలిపారు. “ఈ హైబ్రిడ్ కాలీఫ్లవర్ యొక్క పోషక విలువ చాలా ఎక్కువ. ఆంథోసైనిన్స్ కంటెంట్ హైబ్రిడ్ కాలీఫ్లవర్‌కు యాంటీ బాక్టీరియల్ మరియు క్యాన్సర్ నిరోధించడంలో ఇది తోడ్పడుతుంది. సాధారణ సాంప్రదాయ కాలీఫ్లవర్‌తో పోలిస్తే వీటిలో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ కంటి చూపు, ఫ్లూ నుంచి రక్షణ ఇస్తుంది. వీటితోపాటు చర్మ సంరక్షణకు కూడా ఎంతో సహయపడుతుంది.

మహీంద్ర నికమ్ పండించిన పసుపు, గులాబీ రంగులు కాలీఫ్లవర్స్ 20 వేల కిలోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విత్తనాల ఖర్చు రూ. 40వేలు, నీటి పారుదల, ఎరువులు, వ్యవసాయ కార్మికుల ఖర్చు 2 లక్షలు అని.. ఈ రంగుల కాలీఫ్లవర్లను అమ్మితే దాదాపు రూ.16 లక్షలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజీ బుస్ దాకా వెళ్లింది. దాదాజీ మాట్లాడుతూ… “జనరల్‌గా కాలీఫ్లవర్ తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఇది పసుపు, గులాబీ లేదా గులాబీ కలర్‌లో పెరిగింది. మామూలు కాలీఫ్లవర్ ధరకే వీటిని అమ్మే అవకాశాలు ఉన్నాయి” అన్నారు.

Also Read:

Man Gifts Kidney To His Wife: భార్యకు కిడ్నీ ఇచ్చేసిన భర్త.. ప్రేమికుల రోజున ‘జీవితమే’ గిఫ్ట్!