7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పెన్షన్ లిమిట్‌ను పెంచుతూ కీలక నిర్ణయం

కేంద్రం ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. కుటుంబంలో ఫించన్ తీసుకునే వారికీ ప్రయోజనం చేకూరేలా మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్...

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పెన్షన్ లిమిట్‌ను పెంచుతూ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Feb 15, 2021 | 3:22 PM

7th Pay Commission: కేంద్రం ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. కుటుంబంలో ఫించన్ తీసుకునే వారికీ ప్రయోజనం చేకూరేలా మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫ్యామిలీ పెన్షన్ ను పెంచుతున్నామని ప్రకటించారు.  ఈ నిర్ణయంతో ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువ పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ లిమిట్ నెలకు రూ. 45 వేలకంటే తక్కుగా ఉండి .. ఒకే కుటుంబంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే.. వారి ఇద్దరి పెన్షన్ కుటుంబ సభ్యులకు అందే విధంగా నిబంధనలను ఉండేవి.. అయితే ఈ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది.

ఇక నుంచి పెన్షన్ లిమిట్ నెలకు గరిష్టంగా రూ. 1,25,000 వరకు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం మోడీ సర్కార్ పెన్షన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 6వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ అందుతుండగా ఇకపై 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనం అందనుంది.

అంతేకాదు.. ఎవరైనా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు  మరణిస్తే వారి భాగస్వామి పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. భాగస్వామి కూడా చనిపోతే పిల్లలు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గరిష్ట వేతనంగా రూ 2.5 లక్షలను పరిగణనలోకి తీసుకోవడంతో అందులో సగం 1,25,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: మీది లక్షలకోట్లు విలువజేసే కంపెనీ కావచ్చు ప్రజల వ్యక్తిగత గోప్యతే ముఖ్యమన్న సుప్రీం కోర్టు..

పసుపు, గులాబీ రంగులలో కాలీఫ్లవర్ల్స్ పండించిన మహారాష్ట్ర రైతు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్…