Dancing Queen : 100వ పుట్టిన రోజు జరుపుకున్న బామ్మ .. డ్యాన్స్‌తో అదరగొట్టిన వృద్ధురాలు, నెటిజన్లు ఫిదా
పుట్టిన రోజు అంటే ఓ పండగే అందరికి.. అది మొదటి పుట్టినరోజైనా శతాధిక జన్మదినమైన ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఇక అమెరికాకు చెందిన ఓ బామ్మ తన 100వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. అంతేనా ఆనందంగా...
Dancing Queen : పుట్టిన రోజు అంటే ఓ పండగే అందరికి.. అది మొదటి పుట్టినరోజైనా శతాధిక జన్మదినమైన ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఇక అమెరికాకు చెందిన ఓ బామ్మ తన 100వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. అంతేనా ఆనందంగా గడిపేందుకు వయసుతో సంబంధం లేదంటూ.. ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అమెరికా ఓక్లహామాకు చెందిన సిల్వియా ఓవెన్స్ 100వ సంవత్సరంలో అడుగుపెట్టారు. వేబేర్ కంట్రీ నర్సింగ్ హోమ్‌లో ఉంటున్న ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. సహచరులు, సిబ్బంది మధ్య వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె హుషారుగా డ్యాన్స్ చేశారు. ఎంతో సంతోషంగా కనిపించారు. నిలబడేందుకు కాళ్లు సహకరించనప్పటికీ.. నడిచే పరికరం వాకర్‌ను సపోర్ట్‌తో డ్యాన్స్ చేసి.. అందరిలో ఓ కొత్త ను జోష్ నింపింది.
View this post on Instagram
బామ్మ డ్యాన్స్ వీడియోను నర్సింగ్‌హోమ్ అధికారిక ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ బామ్మ సంతోషం నెటిజన్లకు సంతోషాన్ని పంచుతోంది. డ్యాన్స్ తర్వాత ఆ బామ్మ ఫొటోలు దిగారు. 100 ఏళ్ల సంతోషం అంటూ వాటిని పోస్ట్ చేశారు. ఈ 100 ఏళ్ల బామ్మ సిల్వియా చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. ఆమెకు అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ..డ్యాన్సింగ్ క్వీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: