గణేశ చతుర్థినాడు దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడిని ఇలా పూజించండి.. వినాయకపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే..

సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు కావడంతో ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు. మనం చేసే అన్ని పనులకు ఎలాంటి విఘ్నాలు

గణేశ చతుర్థినాడు దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడిని ఇలా పూజించండి.. వినాయకపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే..
Follow us

|

Updated on: Feb 15, 2021 | 4:41 AM

Ganesh Chaturthi : సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు కావడంతో ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు. మనం చేసే అన్ని పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తారు. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసి చిన్నా, పెద్దా అందరూ బొజ్జ గణపయ్యను కొలుస్తారు. హిందూ క్యాలెండర్ లో ప్రతి నెల శుక్ల పక్ష నాలుగవ రోజున గణేశ చతుర్థిని పాటిస్తారు. శివపార్వతుల కుమారుడైన గణేశుడి జన్మదినం సందర్భంగా ఈ రోజు జరుపుకుంటారు. దీనిని మాఘీ గణేష్ జయంతి అని కూడా పిలుస్తారు. గణేశ చతుర్థిని గోవా, మహారాష్ట్రలలో ప్రధానంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు గణేశుడిని ఆరాధిస్తారు మరియు ఒక రోజు ఉపవాసం ఉంటారు.

ఇక ఈ నెల  గణేశ చతుర్థి ఫిబ్రవరి 15వ తేదీన(సోమవారం) వచ్చింది.అలాగే వినాయకపూజకు శుభ ముహూర్తం ఉదయం 11:28 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:43 గంటలకు ముగుస్తుంది. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటే వారు జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి తరువాత నాల్గవ రోజున ప్రజలు విగ్నేశ్వరుడిని ఆరాధిస్తారని చెప్తుంటారు. గణేశుడిని విఘ్నహర్త అని పిలవడానికి ఇదే కారణం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులు ఈ రోజున గణేశుడి విగ్రహానికి ఎర్ర బట్టలు, ఎర్రటి పువ్వులులతో పూజిస్తారు. అలాగే ఎర్రటి స్వీట్లను నైవేద్యంగా పెడుతుంటారు. ఇక ఈ రోజున ప్రజలు చంద్రుని వైపు చూడరు. దానికి కారణం ఏంటంటే..చంద్రుడు గణనాధుడిని ఎగతాళి చేసినందుకు గాను ఇదే రోజున గణేశుడు చంద్రుడిని  శపించాడు, ఈ రోజున ఎవరైనా చంద్రుడిని చూస్తే, ఆ వ్యక్తి చాలా బాధలకు గురవుతాడని, నిందలపాలవుతాడని ప్రజలు నమ్ముతారు.