AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: ఫిబ్రవరి 15 రాశి ఫలాలు.. ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి..

Today Horoscope: ప్రతిరోజూ ఒక కొత్త అవకాశమని చెబుతుంటారు. అలాంటి రోజును ఎంత సానుకూల దృక్ఫథంతో ప్రారంభిస్తే అంత మంచి చేకూరుతుంది. మరి పలానా రోజు మనకు ఎంత వరకు కలిసొస్తుంది..? కొత్త పనులు మొదలు పెట్టొచ్చా లేదా.?

Today Horoscope: ఫిబ్రవరి 15 రాశి ఫలాలు.. ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి..
Narender Vaitla
|

Updated on: Feb 15, 2021 | 7:29 AM

Share

Today Horoscope: ప్రతిరోజూ ఒక కొత్త అవకాశమని చెబుతుంటారు. అలాంటి రోజును ఎంత సానుకూల దృక్ఫథంతో ప్రారంభిస్తే అంత మంచి చేకూరుతుంది. మరి పలానా రోజు మనకు ఎంత వరకు కలిసొస్తుంది..? కొత్త పనులు మొదలు పెట్టొచ్చా లేదా.? వాహనాలు కొనుగోలు చేయాలా.? ఇలా ఎన్నో సందేహాలు మనలో తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు ముందుగా తమ రాశి ఫలాలను చూసుకొని రోజును ప్రారంభిస్తుంటారు. మరి ఈ రోజు (సోమవారం) ఏయే రాశుల వారికి ఎలా ఉండనుంది.? లాంటి వివరాలను ఈ రోజు రాశిఫలాలో చూద్దాం..

మేషరాశి:

ఈ రాశి వారు ఈరోజు సంఘంలో మంచి గౌరవాలను పొందుతారు. వ్యాపార అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశుల వారు మహా లక్ష్మి అమ్మవారికి తామర పుష్పాలు సమర్పిస్తే మంచిది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఈ రోజు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కలుసుకుంటారు. కొన్ని మంచి వార్తలు వింటారు. కాల భైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన.

మిథున రాశి:

ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపార సంబంధిత అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మహా కాళీ అమ్మవారి స్తోత్ర పరాయణం, దర్శనం చేస్తే లాభం చేకూరుతుంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వారు వ్యక్తిగత అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెరుగన్నంను నివేదన చేయడం మంచిది.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ రోజు రావాల్సిన బాకీలు వసూళు అవుతాయి. ఆద్మాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుర్గ అమ్మవారి నామస్మరణ వీరికి మేలు చేస్తుంది.

కన్యా రాశి:

నూతన కార్యక్రమాలు చేపడతారు, ఈ రోజు ఈ రాశివారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పేదవారికి ఈ రోజు కాయకూరలు దానం చేయడం ఈ రాశి వారికి మంచిది.

తులా రాశి:

ఈ రాశి వారికి కొన్ని వ్యవహారిక విషయాలు మధ్యలో ఆగిపోవడం లేదా.. ఆలస్యమవుతాయి. వీరు అష్ట లక్ష్మి పారాయణం చేస్తే మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులతో కార్యక్రమాలు, ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. పోటీతత్వం పెరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. కామాక్షి అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

ధనస్సు రాశి:

ఈ రాశి వారు ఈరోజు రోజు ముఖ్యమైన పనులు చేపట్టే సమయంలో ముందు జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది. అనుకోని ప్రయాణాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. నంది వర్థన పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చన నిర్వహిస్తే మంచి జరుగుతుంది.

మకర రాశి:

మకర రాశి వారు ఈరోజు చేపట్టే నూతన కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. తెల్లని పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చన చేసుకోవడం మంచిది.

కుంభ రాశి:

ఈ రాశి వారు ఈరోజు సన్నిహితుల నుంచి మంచి వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతుంటాయి. విష్ణు ఆరాధన, దీప సమర్పణ చేస్తే ఈ రాశి వారికి ఈరోజు మంచి జరుగుతుంది.

మీన రాశి:

మీన రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం సూచించదగ్గ అంశం.

Also Read: గణేశ చతుర్థినాడు దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడిని ఇలా పూజించండి.. వినాయకపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే..