AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాదాపు రూ. 300 కోట్లు పెట్టి, రహస్య ఇంటిని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ఎందుకో తెలుసా?

ఎలన్ మస్క్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లోని టుస్కానీ కొండల మధ్య 14,400 చదరపు అడుగుల భవనాన్ని కొనుగోలు చేశారు

దాదాపు రూ. 300 కోట్లు పెట్టి, రహస్య ఇంటిని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ఎందుకో తెలుసా?
Tesla Ceo Elon Musk Family
Balaraju Goud
|

Updated on: Oct 31, 2024 | 5:19 PM

Share

ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని ప్రపంచానికి అందించిన ఎలోన్ మస్క్ అమెరికాలో రహస్య ఇంటిని కొనుగోలు చేశారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ ఇంట్లో మస్క్ తన 11 మంది పిల్లలతో కలిసి జీవించనున్నారు. మస్క్ ఎప్పుడూ తన కుటుంబ భద్రత గురించి చాలా సీరియస్ గా ఉంటారు. ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. దీనివల్ల చాలా మంది శత్రువులను సృష్టించుకుంటున్నారు. ఈ విషయంలో, కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి, మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, మస్క్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లోని టుస్కానీ కొండల మధ్య 14,400 చదరపు అడుగుల భవనాన్ని కొనుగోలు చేశారు. US డాలర్లలో దీని ధర దాదాపు 35 మిలియన్ డాలర్లు, ఇది భారతీయ రూపాయలలో చూస్తే దాదాపు 300 కోట్ల రూపాయలు అవుతుంది. మస్క్ కుటుంబం ఈ కొత్త నివాసం వారి ప్రస్తుత ఇంటికి కేవలం 10 నిమిషాల దూరంలో ఉంది. చట్టపరమైన సమస్యల కారణంగా, మస్క్ తన వ్యాపారాన్ని టెక్సాస్‌లో ఎక్కువగా కేంద్రీకరించారు.

ఎలోన్ మస్క్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య పేరు జస్టిన్ మస్క్. ఆమెకు జస్టిన్‌తో ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆ తరువాత, మస్క్ హాలీవుడ్ నటి తల్లులా రిలీని వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ అతనికి రిలేతో పిల్లలు లేరు. మస్క్ ముగ్గురు పిల్లలు ప్రముఖ సంగీత విద్వాంసుడు సీన్ గ్రిమ్స్ అలియాస్ క్లైర్ బౌచర్‌కు జన్మనిచ్చారు. కాగా మస్క్‌కి చెందిన న్యూరాలింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

ఇక ఎలన్ మస్క్ పిల్లల పేర్ల విషయానికి వస్తే, చిత్ర విచిత్రంగా ఉంటాయి. జస్టిన్ మస్క్ పెద్ద కుమారుడు, నెవాడా అలెగ్జాండర్, 2002లో మరణించారు. దీని తరువాత, గ్రిఫిన్, వివియన్ అనే ఇద్దరు కవలలు జన్మించారు. దీని తరువాత, జస్టిన్‌కు ముగ్గురు అబ్బాయిలు జన్మించారు. వీరి పేర్లు కై, సాక్సన్, డామియన్. గ్రిమ్స్ , మస్క్‌లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు X Æ A-Xii (X యాష్ ఎ పన్నెండు), టెక్నో మెకానికస్ మస్క్. కూతురు పేరు అక్సా డార్క్ సైడెరల్ మస్క్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..