AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: భారత్-చైనా మధ్య తీపి కబురు.. స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న ఇరు జవాన్లు..!

నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది.

Diwali 2024: భారత్-చైనా మధ్య తీపి కబురు..  స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న ఇరు జవాన్లు..!
Lac Border
Balaraju Goud
|

Updated on: Oct 31, 2024 | 9:42 PM

Share

భారత్-చైనా అనగానే మనకు గొడవలే గుర్తుకొస్తాయి. గత ఐదారేళ్లుగా సాగుతున్న గొడవల్లో మనం మన సైనికులను కోల్పోయాం. కానీ ఈసారి సీన్‌ మారింది. కొన్నేళ్ల గొడవల స్థానంలో, ఇప్పుడు హిందీ-చీనీ భాయ్‌ భాయ్‌ అనే పాట స్ఫూర్తి అక్కడ కనిపిస్తోంది.

తూర్పు లద్దాఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల్లో చైనా సైన్యాల ఉహసంహరణ ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇండియా – చైనా సరిహద్దుల్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చైనా సైనికులతో స్వీట్లు పంచుకున్నారు భారత సైనికులు. దీపావళి సందర్భంగా ఎల్​ఏసీ వెంబడి అనేక సరిహద్దు పాయింట్ల దగ్గర భారత్​, చైనా సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా LACలో పెట్రోలింగ్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

“దీపావళి సందర్భంగా, LAC వెంబడి అనేక సరిహద్దుల వద్ద భారతదేశం మరియు చైనా సైనికుల మధ్య స్వీట్స్ మార్పిడి జరిగింది” అని ఆర్మీ మూలం వార్తా సంస్థ PTIకి తెలిపింది. LACతో సహా ఐదు బోర్డర్ పర్సనల్ మీటింగ్ (BPM) పాయింట్ల వద్ద ఈ మార్పిడి జరిగిందని సోర్సెస్ తెలిపింది. ఈ స్వీట్ల మార్పిడి, చర్చల పరంపర రెండు దేశాల మధ్య సంబంధాలలో తీపిని తీసుకొచ్చే ప్రయత్నం. స్థానిక కమాండర్ల మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతుంది. ఇది సరిహద్దులో ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుంది. దీపావళి సందర్భంగా లడఖ్‌లోని DBO, కారకోరం పాస్, హాట్ స్ప్రింగ్స్, కాంగ్ లా మరియు చుషుల్ మోల్డో వద్ద భారత్ – చైనా సైనికుల మధ్య మిఠాయిలు మార్చుకున్నారు. దీంతో వివాదాస్పద ప్రదేశాలలో పెట్రోలింగ్‌ను పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం చేసింది. సరిహద్దులో శాంతిని పునరుద్ధరించే దిశగా ఈ చర్య ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇటీవల, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గత కొన్ని వారాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల తరువాత, ఒక ఒప్పందం ఖరారైందని, ఇది 2020 నాటి వివాదాలకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు.

2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్య, కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించగా ఘర్షణల కేంద్రమైన దెప్సాంగ్‌, దేమ్‌చుక్‌ దగ్గర మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. అలా నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత జరుగుతున్న తొలి దీపావళి కావడంతో స్వీట్లు పంచుకున్నారు సైనికులు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..