AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి మరణించింది. స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో దీప్తి మృతి చెందగా మరో యువతి గాయపడింది.

Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
Texas Road Accident
Anand T
|

Updated on: Apr 18, 2025 | 9:51 AM

Share

పై చదవుల కోసమై విదేశాలకు వెళ్లిన..కొందరు యువత విగతజీవులుగా ఇంటికి చేరుతున్నారు. అక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కాల్పులు, కత్తుల దాడుల్లో కొందరు విద్యార్తులు చనిపోతుంటే..రోడ్డు ప్రమాదాల్లో మరి కొందరు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మరణించింది.

గుంటూరు జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన దీప్తి  పై చదువుల కోసం కొన్నాళ్ల క్రితం యూఎస్ వెళ్లింది. టెక్సాస్‌లోని డెంటన్‌ సిటీలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ చేస్తోంది. అయితే ఈ నెల 12న తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు వాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి మరణించగా, మరో యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంకో నెల రోజుల్లో దీప్తి కోర్సు పూర్తి కానుంది. కోర్సు పూర్తయ్యాకు దీప్తి ఇండియాకు వద్దామనుకున్నట్టు తెలుస్తోంది.

నెల రోజుల్లో చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుందనుకున్న కూతురు..ఏకంగా తిరిగి రాని లోకాలకే వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

Follow Us
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?
వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?
జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..
జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!
రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!