AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDF: అమెరికాలో ఘనంగా ‘టీడీఎఫ్‌’ సిల్వర్‌జూబ్లీ వేడుకలు!

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ (TDF) USA రజతోత్సవ వేడుకలు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.‘ ప్రగతి తెలంగాణం’ పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ఇండియా నుంచి శుభాకాంక్షలు పంపారు.

TDF: అమెరికాలో ఘనంగా ‘టీడీఎఫ్‌’ సిల్వర్‌జూబ్లీ వేడుకలు!
Tdf Silver Jubilee Celebrat
Anand T
|

Updated on: Aug 13, 2025 | 6:52 PM

Share

మిల్పిటాస్‌ (కాలిఫోర్నియా): తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ (TDF) USA రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఫోక్‌ నైట్‌, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్‌ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం. కోదండరామ్‌, విద్యాశాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్‌ రెడ్డి, సాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్‌ జనరల్‌ డా. కే. శ్రీకర్‌ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్‌ నేషనల్‌ కన్వీనర్‌ వెంకటరెడ్డి, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మాజీ డైరెక్టర్‌ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్‌ చల్లా తదితరులు హాజరయ్యారు.

కలర్ఫుల్‌గా మూడు రోజుల వేడుకలు

టీడీఎఫ్‌ అమెరికా చైర్మన్‌ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్‌, కన్వీనర్‌ మహేందర్‌ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్‌ సుజేందర్‌ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్‌ ఫోరం, పొలిటికల్‌ ఫోరం, స్టార్టప్‌ ఫోరం, విజన్‌ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

పురస్కారాల ప్రదానం

ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణించిన వారికి టీడీఎఫ్‌ అవార్డులను అందజేసింది. రాష్ట్రానికి చెందిన డా. దివేష్‌ అనిరెడ్డి, డా. గోపాల్‌ రెడ్డి గాదేల లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకోగా.. టీ. రామచంద్రరెడ్డి టీడీఎఫ్‌ లైఫ్‌టైమ్‌ ఫిలాంత్రఫీ అవార్డును అందుకున్నారు. సోషల్‌ ఇంపాక్ట్‌ పార్ట్‌నర్‌ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. అనంతరం వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.