AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్.. ఎంచక్కా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న జింకలు.. హృదయాన్ని హత్తుకుంటోంది!

ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల్లో కెల్లా మానవుడే అత్యంత తెలివైనవాడని అంటారు. చిన్నతనం నుండి మనకు ఏది సరైనదో ఏది మాత్రమే నేర్చుకుంటాం. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి చాలా సందర్బాల్లో వాటిని విస్మరిస్తాం. ఇది తప్పు అని తెలిసినా కూడా, చాలా మంది నిబంధనలను నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తుంటారు.

Viral Video: వావ్.. ఎంచక్కా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న జింకలు.. హృదయాన్ని హత్తుకుంటోంది!
Deer Maintaining Trafic Rules
Balaraju Goud
|

Updated on: Aug 13, 2025 | 6:58 PM

Share

ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల్లో కెల్లా మానవుడే అత్యంత తెలివైనవాడని అంటారు. చిన్నతనం నుండి మనకు ఏది సరైనదో ఏది మాత్రమే నేర్చుకుంటాం. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి చాలా సందర్బాల్లో వాటిని విస్మరిస్తాం. ఇది తప్పు అని తెలిసినా కూడా, చాలా మంది నిబంధనలను నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తుంటారు.

ముఖ్యంగా ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో తరుచూ తప్పులు చేస్తుంటారు. తమతో పాటుగా ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. కానీ మూగ జంతువులు అలా కాదు.. ఒకసారి వాటికి ఏదైనా నేర్పించామంటే.. అవి దానిని ఎప్పటికీ మర్చిపోవు. అది నిజాయితీ అయినా, ఇతరులను ప్రేమించడం అయినా, చెప్పినవన్నీ పాటించడం అయినా సరే.. మనుషుల కంటే మూగ జంతువులు చాలా మెరుగ్గా ఉంటాయంటున్నారు జంతు ప్రేమికులు. ప్రస్తుతం అలాంటి క్రమశిక్షణ కలిగిన జింక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జింక రోడ్డు దాటుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నట్లుగా చూపించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

జపాన్‌లోని నారా పార్క్ జరిగిన ఈ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో, రద్దీగా ఉండే రోడ్డును దాటే ముందు ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చగా మారడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారితో జింకలు జత కలిశాయి.

వైరల్ వీడియోలో, జనం చుట్టూ ఉన్నప్పటికీ, జింకలు సిగ్నల్ దగ్గర ప్రశాంతంగా నిలబడి ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ మారే వరకు వన్యప్రాణులు ఓపికగా వేచి ఉన్నాయి. లైట్ ఆకుపచ్చగా మారిన వెంటనే, జింకలు కూడా ట్రాఫిక్ నియమాలు తెలిసినట్లుగా రోడ్డు దాటడం ప్రారంభించాయి.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Ameana Finds (@amina_finds)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @amina_finds అనే ఖాతా నుండి షేర్ చేయడం జరిగింది. యూజర్ క్యాప్షన్‌లో, ” జపాన్‌లో 1000 IQ ఉన్న జింకలు” అని రాశారు. వీడియోలోని జింకలు తమ క్రమశిక్షణా ప్రవర్తనతో ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. నెటిజన్లు వాటిని తీవ్రంగా ప్రశంసిస్తున్నారు.

జపాన్‌లోని నారా పార్క్ సికా జింకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వీటిని పవిత్రంగా భావిస్తారు. అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ చేతులతో వాటికి ఆహారం పెడతారు. ప్రతిగా జింకలు కూడా తల వంచి తమ కృతజ్ఞతను తెలియజేస్తాయి.

ఈ వీడియో చూసిన తర్వాత, ప్రజలు చాలా కామెంట్లు చేశారు. జపాన్‌లో అందరూ క్రమశిక్షణతో ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్ చూసిన తర్వాత జింకలు కూడా రోడ్డు దాటుతాయంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరొక యూజర్, ఇది నా హృదయాన్ని తాకింది బ్రదర్ అంటూ పేర్కొన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..