Army Tank Taxi: మనోడి టేస్టే వేరు.. యుద్ధ ట్యాంక్‎ను టాక్సీగా మార్చాడు.. దానికి ఎంత ఖర్చు చేశాడంటే..

ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ల అభిరుచి మనకు వింతగా అనిపిస్తుంది. కానీ అది చేయడం వాళ్లకు ఇష్టం. కొందరు పాత తరం కార్లను ఇష్టపడతారు. మరికొందరు లగ్సరీ కార్లను ఇష్టపడతారు. ఇంకొదరు కారు రూపురేఖలు మార్చి ఉపయోగిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం..

Army Tank Taxi: మనోడి టేస్టే వేరు.. యుద్ధ ట్యాంక్‎ను టాక్సీగా మార్చాడు.. దానికి ఎంత ఖర్చు చేశాడంటే..
Army Tank
Follow us

|

Updated on: Nov 29, 2021 | 12:46 PM

ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ల అభిరుచి మనకు వింతగా అనిపిస్తుంది. కానీ అది చేయడం వాళ్లకు ఇష్టం. కొందరు పాత తరం కార్లను ఇష్టపడాతారు. మరికొందరు లగ్సరీ కార్లను ఇష్టపడతారు. ఇంకొదరు కారు రూపురేఖలు మార్చి ఉపయోగిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం యుద్ధ ట్యాంక్‎ను కొనుగోలు చేసి దాన్ని టాక్సీగా వాడుతున్నారు. మెర్లిన్ బ్యాచెలర్ అనే బ్రిటీష్ వ్యక్తి ఒకప్పటి బ్రిటిష్ ఆర్మీ ట్యాంక్‌పై 20,000 పౌండ్స్ (రూ. 20 లక్షలు) ఖర్చు చేసి దానిని టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. మెర్లిన్‎ ‎FV 432 ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్‎ను కొనుగోలు చేశాడు. 1967 సంవత్సరానికి చెందిన యుద్ధ ట్యాంక్ కొనుగోలు చేసే వరకు నాలుగు దశాబ్దాలుగా ఒక యార్డ్‌లో ఉందని మెర్లిన్ చెప్పారు. మెర్లిన్ ప్రస్తుతం ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్‌ను ట్యాక్సీగా నడపడానికి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం, అతను వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు ప్రయాణికులను తీసుకెళ్లడానికి మాత్రమే లైసెన్స్ పొందాడు.

“మొదట, నాకు ఇరుగుపొరుగువారు వాహనంతో తీసుకెళ్లమని అడిగేవారు. తర్వాత అందరిని తీసుకెళ్లడానికి మాజీ సైనిక వాహనాన్ని ఉపయోగిస్తున్నానని” మెర్లిన్ చెప్పాడు. అతని వారానికోసారి సూపర్‌మార్కెట్‌కు వెళ్లి ఆ తర్వాత అతని నలుగురు కుమార్తెలను నార్‌ఫోక్‌ నార్విచ్‌లోని వారి స్థానిక పార్కుకు తీసుకెళ్తారు. “నా ముగ్గురు చిన్న అమ్మాయిలు ఈ వాహనాన్ని ఇష్టపడతారు” “వారు దానిలో పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారు” అని అన్నాడు. ” నేను దాన్ని ఆర్డర్ చేసే వరకు నా పెద్ద కుమార్తె యుద్ధ ట్యాంక్ అభిమాని. ఇప్పుడు ఆమె సెకండరీ స్కూల్‌లో చదువుతోంది” అని పేర్కొన్నాడు.

“సౌకర్యవంతమైన అప్‌హోల్‌స్టర్డ్, టీవీ, స్టవ్‌తో సహా అన్ని మోడ్‌ల కాన్స్‌తో, క్యారియర్‌లో ఒకేసారి తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చోవడానికి స్థలం ఉంది. బ్యాచెలర్ వివాహాలు, అంత్యక్రియలకు ప్రయాణికులను తీసుకువెళ్లడానికి మాత్రమే లైసెన్స్ ఉంది. పుట్టినరోజు పార్టీల వంటి మరిన్ని ఈవెంట్‌లను చేయడానికి మరొక అనుమతిని పొందాలనుకుంటున్నా” అని మెర్లిన్ చెప్పాడు.

Read Also.. Covid 19 Omicron Variant: PCR పరీక్ష ద్వారా కరోనా ఓమిక్రాన్ వేరియంట్‌ని గుర్తించవచ్చా? WHO ఏం చెప్పిందంటే..?