TANA Conference 2023: భవిష్యత్ తరాల కోసం డైనమిక్ గ్రూప్.. తానా యూత్ కమిటీ కీలక ప్రకటన..
TANA Youth Committee: ఉత్తర అమెరికాలోని పురాతన, అతిపెద్ద ఇండో-అమెరికన్ సంస్థ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ సమావేశాలు జూలై 7,8,9 వ తేదీల్లో జరగనున్నాయి.

TANA Youth Committee: ఉత్తర అమెరికాలోని పురాతన, అతిపెద్ద ఇండో-అమెరికన్ సంస్థ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ సమావేశాలు జూలై 7,8,9 వ తేదీల్లో జరగనున్నాయి. 23వ తానా కాన్ఫరెన్స్ ఫిలడెల్ఫియాలోని పెల్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్నాయి. తానా సమావేశాలను పురస్కరించుకుని కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక, విద్యా అవసరాలను గుర్తించడం, సమస్యలను పరిష్కరించడం, ప్రతిభను గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి తానా అవార్డ్స్ లను కూడా అందజేయనుంది. అంతేకాకుండా యువత అవసరాలను గుర్తించడం, వారిని ప్రోత్సహించేందుకు వేదికను కూడా ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో తెలుగు యువతను ఆదుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
తానా 2023 కాన్ఫరెన్స్ కోసం.. తానా యూత్ కమిటీ భవిష్యత్తు తరాల పిల్లలను ఏకం చేయడానికి ఓ డైనమిక్ వేదికను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. సాంస్కృతిక వారసత్వాన్ని స్వీకరించడం, అదే విధంగా ఆచరించడం, వారి భాగస్వామ్య అభిరుచితో గుర్తింపును పెంపొందించే విధంగా ముందుకువెళ్తోంది. ఈ సమావేశాల్లో ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యేలా, ఇంకా ఆకర్షించే పద్ధతిలో కమిటీ పలు కార్యక్రమాలకు ప్రణాళిక చేసింది.
ముఖ్యంగా తెలుగు సాంస్కృతిక, సంప్రదాయ వారసత్వాన్ని కొనసాగించడంతోపాటు.. తానా యూత్ కమిటీ తెలుగు పిల్లల భవిష్యత్ తరాలకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శాశ్వత సంబంధాలను ఏర్పరుచుకునేలా ప్రోత్సహించడం ద్వారా వారిని శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.




తానా కాన్ఫరెన్స్ లో పాల్గొనే వారు పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి..
తానా రిజిస్ట్రేషన్ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..
