Baba Vanga: బాబా చెప్పిన భయానక జోస్యం నిజమవుతుందా..? అదే జరిగితే అంతా కల్లోలమే.. ఈ ఏడాదే
బాబా వంగా.... అసలు పేరు వెంగోలియా పాండేవ్ దిమిత్రోవా..! 1911లో బల్గేరియాలో ఆమె జన్మించారు. 12 ఏళ్ల వయస్సులో.. ఓ పెనుతుఫానులో తన రెండు కళ్లను కోల్పోయారు. అప్పట్నుంచి ఆమెకు భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగే... పెనుప్రమాదాలు, ప్రకృతి ప్రకోపాలు కంటి ముందు కనిపించేవట.

1945 రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో.. జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై.. అమెరికా రెండు అణుబాంబు దాడులు చేసింది. అణుబాంబు ఎఫెక్ట్‌కు.. రెండు నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఈ దాడుల్లో.. కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే…! ఇప్పుడు ఇలాంటి దాడులే జరుగుతాయట..!! అది కూడా… ఈ ఏడాది చివర్లో అణుదాడి జరుగుతుందని, అది భూమిపై భయంకరమైన విధ్వంసం సృష్టిస్తుందని… చాలా ఏళ్ల క్రితమే చెప్పిన వంగా బాబా భవిష్యవాణి.. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
ఆశ్చర్యం.. అద్భుతం..! కానీ.. నమ్మశక్యంకానిది..! అంధురాలైన బాబా వంగా నోటి నుంచి వచ్చిన ప్రతీ భవిష్యవాణి.. దాదాపుగా నిజమైందని కొందరు చెబుతారు. 26 ఏళ్ల క్రితం చనిపోయినా.. ఇప్పటికీ ఆమె చెప్పిన ప్రతీ ప్రవచనం.. దాదాపుగా నెరవేరాయని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నమ్ముతారు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా.. బాబా వంగా కూడా కాలజ్ఞాని..! భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందే అంచనా వేసి చెప్పగా, వాటిలో చాలావరకు నిజమయ్యాయట..!! ఈ క్రమంలోనే… ఈ ఏడాది చివరన అణు ముప్పు పొంది వుందన్న బాబా వంగా భవిష్యవాణి… ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది.
బాబా వంగా…. అసలు పేరు వెంగోలియా పాండేవ్ దిమిత్రోవా..! 1911లో బల్గేరియాలో ఆమె జన్మించారు. 12 ఏళ్ల వయస్సులో.. ఓ పెనుతుఫానులో తన రెండు కళ్లను కోల్పోయారు. అప్పట్నుంచి ఆమెకు భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగే… పెనుప్రమాదాలు, ప్రకృతి ప్రకోపాలు కంటి ముందు కనిపించేవట. ఆమె ఏదేదో చెబుతుంటే.. అంతా ఆసక్తిగా విన్నారు. వాటిలో కొన్ని జరిగాయి. ఫలితంగా ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మారు ప్రజలు. 85 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు బాబా వంగా. కానీ.. ఇప్పటికి ఆమె ఇల్లును ఓ పవిత్ర మందిరం లాగా భావిస్తారు స్థానికులు. సమాధిని కూడా ఆలయంలా కొలుస్తారు. బ్లైండ్ బాబా వంగా దివ్యదృష్టి , అపారమైన జ్ఞానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేది.. కొన్ని సార్లు.. ఆమె జ్యోతిష్యం గురి తప్పింది. కానీ.. చాలాసార్లు ముమ్మాటికి నిజమయ్యింది.
1923లో మొదటి సారిగా భవిష్యవాణి చెప్పారు బాబా వంగా. కానీ.. 1950 నుంచే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా.. సంచలన జోస్యం చెప్పడం మొదలైంది. ఆతర్వాత.. 1968, 1974, 1979, 1980, 1989, 1992… 1995లో.. ప్రపంచం మొత్తానికి చాలా ముఖ్యమైన భవిష్యవాణి చెప్పారు. వీటిలో చాలావరకూ.. నిజమయ్యాయని నమ్ముతారు. రెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వంగ 1989లోనే జోస్యం చెప్పారు. 2001, సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి జరగడంతో.. ఆమె భవిష్యవాణి ఎఫెక్ట్ ప్రపంచానికి తెలిసింది.
అలానే.. 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పడం, 2004 డిసెంబర్ 26న ఇండోనేషియా, సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ రూపంలో నిజమయ్యాయి. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని వంగ బాబా ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే.. ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అలానే.. 2016లో యూరప్‌లో ఐసిస్ టెర్రర్ దాడి జరుగుతుంది… సిరియా అంతర్యుద్ధం అగ్నిలో కాలిపోతుందని వంగ బాబా భవిష్యవాణి చెప్పారు. అలానే.. 2020లో ప్రపంచమంతా చాలా చెడు ఘటనలు, వ్యాధులు ప్రబలుతాయని, ప్రపంచదేశాల్లో మతపరమైన అల్లర్లు, యూరోపియన్ అస్థిత్వానికి ముప్పు అని చెప్పారు.. చెప్పినట్లుగా.. కరోనా కల్లోలం సృష్టించింది. 2021లో పెట్రోల్ ఉత్పత్తి తగ్గిపోతుందని చెప్పారు.. పెట్రోల్ రేటు సెంచరీ దాటింది.. 2022లో ప్రకృతి విపత్తులు, యుద్ధాలు తప్పవన్నారు..అన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఈ ఏడాది డిసెంబర్‌లో ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.
బాబా వంగా జోస్యం ప్రకారం… ఈ ఏడాది డిసెంబర్‌లో.. అణుశక్తి విస్ఫోటనం జరుగుతుంది. దీంతో… పెద్దఎత్తున ప్రజలు, ధన నష్టం వాటిల్లుతుందని ఆమె అంచనా వేశారు. ఒక పెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌లో పేలుడు సంభవిస్తుందని, ఇది ఆసియా అంతటా విషపూరిత మేఘాలను వ్యాపింపజేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలలో తీవ్రమైన వ్యాధులు వ్యాపిస్తాయి. అణు విస్ఫోటనంతో ఏర్పడే భయంకరమైన రేడియేషన్ కారణంగా… చుట్టూ వినాశనం జరుగుతుందని.. వంగా బాబా చెప్పిన జోస్యం ప్రపంచ వ్యాప్తంగా కలవరం రేపుతోంది.
వంగ బాబా ఏదీ స్వయంగా రాతపూర్వకంగా రాయలేదు. అందువల్ల ఆమె చెప్పిన వాటిలో చాలా వరకూ కల్పించినవే అని కొందరు నమ్ముతున్నారు. ఏదైనా జరిగితే అది ఆమె ముందే చెప్పిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అందువల్ల వంగ బాబా అంచనాలుగా చెబుతున్న వాటిని నమ్మాల్సిన పనిలేదనీ… అసలు భవిష్యత్తును ముందే ఊహించడం ఎవరి వల్లా కాదని అంటున్నారు. బాబా వంగా చెప్పేవాన్నీ పచ్చిఅబద్ధాలని కొట్టేపారేస్తున్నారు. మొత్తానికి ఆమె చెప్పిందే కరెక్ట్ అవుతుందా ? లేదా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏది నిజమో కాలమే చెబుతుంది.
