Afghanistan news: మాట మార్చిన తాలిబన్లు.. అప్పుడేమో అలా..ఇప్పుడేలా ఇలా
అఫ్గానిస్థాన్(Afghanistan)లో అందరూ ఊహించిందే జరిగింది. అధికారంలోకి వచ్చాక పలు కీలక సంస్కరణలు చేస్తున్న తాలిబన్లు బాలికా విద్యపై సంచలన ప్రకటన విడుదల చేశారు. ఆఫ్గానిస్థాన్ ఆక్రమణ తర్వాత అనేక నిబంధనలతో...

అఫ్గానిస్థాన్(Afghanistan)లో అందరూ ఊహించిందే జరిగింది. అధికారంలోకి వచ్చాక పలు కీలక సంస్కరణలు చేస్తున్న తాలిబన్లు బాలికా విద్యపై సంచలన ప్రకటన విడుదల చేశారు. ఆఫ్గానిస్థాన్ ఆక్రమణ తర్వాత అనేక నిబంధనలతో చాలా మంది బాలికలు చదువుకు(Girl Education) దూరమయ్యారు. వారు తిరిగి చదువుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తాలిబన్లు తమ మాట మార్చేశారు. బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హత లేదని, దానికి తాము అంగీకరించబోమని కీలక ప్రకటన చేసింది. వారు చదువును ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని మహిళలకు విద్య, ఉద్యోగంపై పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తూనే ఉంది. తాలిబన్లు ఇందుకు అంగీకరించినా ఇప్పుడు చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు..
తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆసక్తి చూపించడం లేదని, ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని, భవిష్యత్తులో వారిని అనుమతించే అవకాశం ఉందని తాలిబన్ అధికారి ఒకరు చెప్పారు. అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు తాలిబన్లు. మహిళలపై కఠిన ఆంక్షల నేపథ్యంలో సీనియర్ నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొందరు కఠిన పాలనకే మొగ్గు చూపుతుంటే, మరికొందరు మాత్రం సంస్కరణలు చేపట్టడం అవసరమని వాదిస్తున్నారు.
గతంలో అనుమతి ఇచ్చి..
ఉన్నత పాఠశాలల్లో చదువుకునేందుకు బాలికలకు అనుమతిస్తున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. అఫ్గాన్ పాలక ఇస్లామిక్ గ్రూప్ బాలికలకు పూర్తి విద్యను పొందేందుకు అనుమతిస్తుందా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొన్నా.. ఈ ప్రకటనతో దీనికి తెరపడింది. గతేడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్థాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అఫ్గానిస్థాన్ అంతటా పాఠశాలలకు వెళ్లకుండా బాలికలను నిషేధించింది. హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW)లో మాజీ సీనియర్ అఫ్గానిస్థాన్ పరిశోధకురాలు హీథర్ బార్.. బాలికల మాధ్యమిక పాఠశాలలను తెరవడం చాలా ముఖ్యమైనదని అన్నారు.
Also Read
Viral Video:సాయం చేయడానికి సైజ్‌తో పనిలేదు.. పిల్ల తాబేలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
yami gautam: మత్తెకించే చూపులతో.. యూత్‌ను తన వైపు తిప్పుకుంటున్న యామీ గౌతమ్…(ఫొటోస్)
Tax On Petrol: రూ.100 పెట్రోల్ లో టాక్స్ ఎంతో తెలుసా..? తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పన్ను వసూలు..