Support to India: భారత్ కు మద్దతుగా మేమున్నామంటూ ప్రపంచ దేశాలు.. నేనింతే అంటూ కరోనా పుట్టిల్లు చైనా!
భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతొ పరిస్థితి అతలాకుతలంగా మారుతోంది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై వివిధ దేశాలు చలించిపోతున్నాయి.
Support to India: భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతొ పరిస్థితి అతలాకుతలంగా మారుతోంది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై వివిధ దేశాలు చలించిపోతున్నాయి. స్వచ్చందంగా ఇండియాకు ఆపన్నహస్తాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి పలు దేశాలు. అమెరికా సహా బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా, సింగపూర్, సౌదీ అరేబియాలు మేమున్నామంటూ యుద్ధ ప్రాతిపాదికన ముందుకు వచ్చాయి. తమ సహాయాన్ని అందించేందుకు వివిధ రూపాల్లో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో పరిస్ధితి పై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కు సహాయం చేసేందుకు 2,600మంది వైద్యనిపుణులను పంపుతున్న డబ్ల్యుహెచ్‌వో వెల్లడించింది.
వివిధ దేశాల సహాయం ఇలా..
- 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, వైద్య సామగ్రిని పంపిస్తామని తెలిపిన ఐర్లాండ్. రేపు ఉదయం భారత్ చేరుకుంటాయన్న ఐరిష్ రాయబారి బ్రెండన్.
- కరోనా టీకా ముడి సరకులు ఎగుమతి చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికా. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- కరోనా రెండో దశ ను అరికట్టేందుకు మందులు, హెల్త్ కేర్‌కిట్‌లు. వెంటిలేటర్లు ,టీకా తయరీకి అవసరమైన ముడి సరకును అందచేస్తామని హామీ ఇచ్చిన జో బైడెన్
- తక్షణమే 318 ఫిలిప్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపిన అమెరికా. భారత్‌ను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న అమెరికా వ్యాపార వర్గాలు. త్వరలోనే అమెరికా విదేశాంగ మంత్రి తో సమావేశం కానున్న సీఈవోల బృందం.
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్. త్వరలోనే నిధులను కూడా సమీకరించి ఇండియా పంపే యోచన.
- తక్షణమే రూ.135 కోట్లను ప్రకటించిన గివ్ ఇండియా స్వచ్చంధ సంస్ధ, యునిసెఫ్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించినగూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.
- పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల దంపతులు.
- తొలివిడతగా బ్రిటన్ పంపిన 140 వెంటిలేటర్లు,495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరిక.
- కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తక్షణం ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపుతామని ప్రకటించిన ఆస్ట్రేలియా.
- భారత్‌కు మద్దతుగా దుబాయ్‌లోని అతి ఎత్తైన భవనం బుర్జ్-ఎ-ఖలీఫా సహా.. ప్రభుత్వ కార్యాలయాలపై, ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రభుత్వం.
- భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్టాడిన జపాన్ ప్రధాని యోషిహిడే సుగా. కొవిడ్‌పై పోరుకు టెక్నాలజీ సహకారం అందచేస్తామని హామీ ఇచ్చిన యోషిషిడే
చైనా వంకర బుద్ధి..
ఊరందరిదీ ఒక దారి అయితే, ఉలిపికట్టది ఒకదారి అని సామెత. దానికి చైనా మంచి ఉదాహరణ. ప్రపంచం అంతా భారత్ వెన్నంటి నిలుస్తుంటే, కరోనాను పుట్టించి ప్రపంచం పుట్టి ముంచిన చైనా మాత్రం వంకర బుద్దులు చూపిస్తోంది. మొదట కరోనాపై యుద్దానికి భారత్‌కు సహకరిస్తామని చెప్పిన చైనా ఇప్పుడు దొడ్డి దారిన భారత్ కు అడ్డుపుల్లలు వేస్తోంది. భారత్‌లో ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపధ్యంలో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్ ఎయిర్లైన్స్కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజులపాటు తమ కార్గో సర్వీసులను భారత్‌కు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఔషధాలు తరలింపులో తీవ్ర జాప్యం ఏర్పడింది. భారత్‌కు ఆక్సిజన్ తరలింపు వార్తల నేపధ్యంలో చైనాలోని ఆక్సిజన్ తయారీదారులు ధరలు పెంచినట్లు సమాచారం. ఒకేసారి 40 శాతానికి ధరలు పెంచినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. భారీగా కేసులు, మరణాలు నమోదు..