Bomb Blast: పోలియో టీకా సెంటర్ వద్ద బాంబు పేలుడు.. పోలీసులను టార్గెట్ చేసిన మిలిటెంట్లు..
పాకిస్తాన్ లోని క్వెట్టాలో ఆత్మహుతి దాడి జరిగింది. పోలీసుల వ్యాన్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. దాడికి తామే పాల్పడినట్టు తెహరీక్ తాలిబాన్ .. TTP సంస్థ ప్రకటించుకుంది.

పాకిస్తాన్‌లో బాంబుల మోత కొనసాగుతోంది. పాకిస్థాన్‌లోని నైరుతి నగరం క్వెట్టాలో బుధవారం పోలీసు పెట్రోలింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆత్మాహుతి బాంబు పేలుడుకు పాల్పడింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా, 28 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి తామే పాల్పడినట్టు తెహరీక్ తాలిబాన్ .. పాకిస్తాన్ తాలిబాన్ మిలిటెంట్ గ్రూప్ , తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ TTP సంస్థ ప్రకటించుకుంది. పాకిస్తాన్ లోని అన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తామని ఈ సంస్థ హెచ్చరించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి పోలీసు వ్యాన్‌కు చాలా దగ్గరగా వచ్చి ఈ పేలుడు పాల్పడ్డాడు. పేలుడు, ఈ వారం ప్రభుత్వంతో కాల్పుల విరమణను ముగించిన తర్వాత ఈ పేలుడు జరిగింది. “పోలీసు పెట్రోలింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న బాంబు పేలుడులో 15 మంది పోలీసులతో సహా 30 మందికి పైగా గాయపడ్డారుని పోలీసు అధికారి అబ్దుల్ హక్ తెలిపారు. వీరిలో ఒక పోలీసు, ఒక మహిళ,ఒక చిన్నారి మరణించారు. ”
ఆత్మాహుతి పేలుడు సమయంలో పెట్రోలింగ్ పోలియో టీకా బృందానికి సెక్యూరిటీగా వచ్చినట్లుగా సమాచారం. పాకిస్తాన్‌లోని ఇస్లామిస్ట్ మిలిటెంట్లు తరచుగా పోలియో టీకా బృందాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ సంస్థలపై నిఘా పెట్టేందుకు ఈ ఇమ్యునైజేషన్ ప్రయత్నం అని టెర్రరిస్టులు ఆరోపిస్తున్నారు.క్వెట్టా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్ రాజధాని, ఇక్కడ ఇస్లామిస్ట్ , వేర్పాటువాద తిరుగుబాటుదారులు పనిచేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం



