AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: దక్షిణ చైనా సముద్రంలో విషాదం.. నడి సముద్రంలో చిక్కుకున్న 306 మంద్రి శ్రీలంక వాసులు..

శ్రీలంకలో ఉన్న దయనీయ పరిస్థితికి ఉదాహరణ ఈ ప్రమాదం. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో పనిలేక, బతకలేక, కనీసం బతికి ఉండేందుకు తిండిలేక నానా

Big Breaking: దక్షిణ చైనా సముద్రంలో విషాదం.. నడి సముద్రంలో చిక్కుకున్న 306 మంద్రి శ్రీలంక వాసులు..
Migrants(file Photo)
Shiva Prajapati
|

Updated on: Nov 08, 2022 | 6:18 AM

Share

శ్రీలంకలో ఉన్న దయనీయ పరిస్థితికి ఉదాహరణ ఈ ప్రమాదం. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో పనిలేక, బతకలేక, కనీసం బతికి ఉండేందుకు తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు జనం. దేశం దాటి వెళ్లి ఏ తీరానికి చేరుకున్నా ఫర్వాలేదని బయల్దేరారు అంతా. కానీ సముద్రంలో పరిస్థితులు సహకరించక వియత్నా, ఫిలిప్పీన్స్‌ మధ్య చిక్కుకున్నారు. కాపాడాలంటూ తమిళనాడులోని బంధువులకు ఫోన్‌ చేసి వేడుకుంటున్నారు.

అవును దక్షిణ చైనా సముద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. శ్రీలంక నుంచి వలస వెళ్తు సముద్రంలో చిక్కుకున్నారు 306 మంది ప్రయాణికులు. చాలా మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 30 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు మరింత అద్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు, బతుకు కోసం వలస బాట పట్టారు లంకలోని తమిళులు. లంక దాటి ఏ తీరానికి చేరినా ఫర్వాలేదని బాధితులంతా కలిసి బయలుదేరారు. బోటు సామర్థ్యానికి మించి ఎక్కడం, వాతావరణం అనుకూలించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అయితే, బోటు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కట్ అయ్యింది. ఏడుగు గంటల క్రితం సిగ్నల్స్ కట్ అవగా.. ట్రాకింగ్ మిస్ అవ్వడానికి ముందు బాధితులు ఆర్తనాదాలు పెట్టారు. తమను కాపాడాలంటూ తమిళనాడులోని బంధువులకు ఫోన్ చేసి ప్రాధేయపడుతున్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న బోటు ఉన్నట్టా, లేక సముద్రంలో మునిగిపోయిందా? అంతుచిక్కడం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..