Watch: సునామీని తలపించే వరద బీభత్సం.. వందలాది మంది గల్లంతు.. వీడియో చూశారా..?

గతంలో ఇలాంటి వానలను ఆ ప్రాంత వాసులు చూడలేదు.. వినలేదు.. కానీ.. అక్కడ ఒకేసారి కురిసిన అత్యంత భారీ వర్షాలకు ఆ ప్రాంతం అతలాకుతలం అయ్యింది.. సునామీని తలపించే వరద బీభత్సం ఆ ప్రాంతాన్ని చెల్లచెదురు చేసింది.. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు కురవడంతో.. వరదలు పొటెత్తాయి..

Watch: సునామీని తలపించే వరద బీభత్సం.. వందలాది మంది గల్లంతు.. వీడియో చూశారా..?
Spain's 'flood
Follow us

|

Updated on: Oct 31, 2024 | 6:21 PM

సునామీని తలపించే వరదలతో స్పెయిన్‌ విలవిల్లాడుతోంది. ప్రధానంగా.. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఆయా ప్రాంతాలు నదులను తలపించాయి. వాలెన్సీయా ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల కారణంగా వందలాది మంది తప్పిపోవడంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

వరద బీభత్సంతో స్పెయిన్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల ధాటికి సుమారు 95మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వేలాది కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో శివారు ప్రాంతాల్లో గుట్టగుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వరద బీభత్సం తగ్గడంతో వాల్సెనియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న కార్లు, ట్రక్కులే కనిపిస్తున్నాయి. వందలాది మంది తప్పిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.. ముంపు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వీడియో చూడండి..

మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్పెయిన్లోని సుందర నగరాలన్నీ బురదతో నిండిపోయాయి. దాంతో.. వరద మిగిల్చిన బురదను శుభ్రం చేసుకునేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇళ్లలోకి చేరిన బురదను బకెట్లతో ఎత్తిపోసుకుంటున్నారు. స్పెయిన్‌ అధికార యంత్రాంగం కూడా ఫైరింజన్లతో రోడ్లపై ఉన్న బురదను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. స్పెయిన్‌లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ రేంజ్‌లో వర్షాలు బీభత్సం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..