Pope Francis : పోప్ ఫ్రాన్సిస్‌కి ఏమైంది..! రోమ్‌లోని ఆస్పత్రిలో ఎందుకు చేరారు..? శస్త్ర చికిత్స కచ్చితంగా అవసరమా..?
Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కొద్దిరోజులుగా పెద్దపేగు సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీనికి శస్త్రచికిత్స
Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కొద్దిరోజులుగా పెద్దపేగు సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీనికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. అందుకోసం రోమ్‌లోని గెమెల్లి ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా పోప్ ‘‘సింప్టమాటిక్ డైవర్టిక్యులర్ స్టెనోసిస్’ అనే పెద్ద పేగు సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన అధికారిక ప్రతినిధి మాటియో బ్రూని వెల్లడించారు. 2013లో పోప్‌గా ఎన్నికైననాటి నుంచి ఆయన ఆసుపత్రిలో చేరడం ఇదే తొలిసారి అని చెప్పారు.
ఈ ప్రకటనకు మూడు గంటల ముందు ఫ్రాన్సిస్ ‘సండే ట్రెడిషన్’ను అనుసరించి సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ప్రజలను ఉత్సాహంగా పలకరించారు. తాను హంగరీ, స్లోవేకియా వెళ్తానని చెప్పారు. ఒక వారం ముందు 84 ఏళ్ల ఫ్రాన్సిస్, రోమ్ జెమెల్లి పాలిక్లినిక్ వద్ద షెడ్యూల్ చేయబడిన శస్త్రచికిత్సను సూచిస్తూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థన చేయమని కోరారు. పోప్ ఫ్రాన్సిస్ యుక్త వయసులో ఉన్నప్పుడు తలెత్తిన అనారోగ్య సమస్య కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లో ఒకవైపు కొంత భాగాన్ని తొలగించారు. అప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
సయాటికాతో నడుము కింది భాగంలో నొప్పితో ఆయన బాధపడుతున్నారు. అందుకోసం ఆయన ఫిజియో థెరపీ చేయించుకుంటున్నారు. 2014లోనూ ఉదర సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా అయన పలు ముఖ్యమైన కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మేలో, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదంపై జోక్యం చేసుకోవాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోన్ పోప్ ఫ్రాన్సిస్‌ను అభ్యర్థించారు. గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లను “ఊచకోత కోసినందున” ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించడానికి ప్రపంచానికి సహాయం చేయమని ఎర్డోన్ పోప్ ఫ్రాన్సిస్‌ను కోరాడు. హింసకు గురైన అమాయక ప్రజల మరణం ఆమోదయోగ్యం కాదని భయంకరమైనదని పోప్ అన్నారు. దీంతో పాటు ఇది మరణానికి, విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు.