అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు.. మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కేంద్రానికి కుటుంబ సభ్యుల వినతి

అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ముజీబుద్దిన్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముజీబుద్దిన్‌కు తీవ్ర గాయాలు...

అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు.. మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కేంద్రానికి కుటుంబ సభ్యుల వినతి
Follow us

|

Updated on: Dec 21, 2020 | 1:23 PM

అమెరికాలో మరో హైదరాబాద్ వాసిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ముజీబుద్దిన్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముజీబుద్దిన్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం యూనివర్సిటీ ఆఫ్ షికాగో హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ముజీబుద్దిన్ పై కాల్పులు ఎవరు జరిపారు.. ఎందుకు జరిపారనే విషయంపై అక్కడి పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, చంచల్ గూడకు చెందిన సిరాజ్ అనే వ్యక్తిపై ఇటీవల దుండగులు కాల్పులు జరిపారు. చికాగోలో కారు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సిరాజ్ పై ఈ కాల్పులు జరిగాయి. అయితే అతడు ప్రయాణిస్తున్న కారుకు బుల్లెట్లు తగిలిన తీరును పరిశీలిస్తే ఆటోమేటిక్ గన్స్ తో కాల్పులు జరిగినట్లు స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఉంటున్న‌‌ భారతీయులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.