AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ పొలాల్లో పాకిస్తానీ గ్రెనేడ్లు, డ్రోన్ ద్వారా విడిచారట.. హైఅలెర్ట్ లో సరిహద్దు ప్రాంతాలు , నిఘా కట్టుదిట్టం

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో చక్రి పోస్ట్ వద్ద ఓ పొలంలో 11 గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాక్ లోని రావల్పిండి లో గల ఆయుధ ఫాక్టరీ లో తయారైనట్టు తెలుస్తోంది.

పంజాబ్ పొలాల్లో పాకిస్తానీ గ్రెనేడ్లు, డ్రోన్ ద్వారా విడిచారట.. హైఅలెర్ట్ లో సరిహద్దు ప్రాంతాలు , నిఘా కట్టుదిట్టం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 21, 2020 | 1:45 PM

Share

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో చక్రి పోస్ట్ వద్ద ఓ పొలంలో 11 గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాక్ లోని రావల్పిండి లో గల ఆయుధ ఫాక్టరీ లో తయారైనట్టు తెలుస్తోంది. భారత సరిహద్దులకు సుమారు కిలోమీటర్ దూరంలో వీటిని పోలీసులు గుర్తించారు. సలాచ్ అనే గ్రామ పొలంలో ప్లాస్టిక్ పాకెట్ లో ఇవి చుట్టి ఉన్నాయి. వీటిపై ఆర్ జీ ఎస్ అనే మార్క్ ఉందని, పాకిస్థాన్ లో తయారైన బాంబులపై ఈ విధమైన మార్క్ లు ఉంటాయని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఈ గ్రెనేడ్లను జారవిడిచినట్టు భావిస్తున్న డ్రోన్ పై పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాన్ని నాశనం చేయలేకపోయారు. ఇటీవలే ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ ను స్మగుల్ చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఖలిస్థాన్ సంస్థతో లింక్ ఉన్న స్మగర్లకు వీరికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

గత 15 నెలల్లో సరిహద్దుల్లోని పాక్ ఉగ్రవాదుల కోసం ఆయుధాలు, గ్రెనేడ్ల ను ఇలా స్మగుల్ చేస్తున్నారు. తాజాగా ఈ బాంబుల స్వాధీన ఉదంతం ఎనిమిదవది. పాక్ ఐ ఎస్ ఐ ఈ విధమైన కుట్రలకు పాల్పడుతోందని, అయినా మన భద్రతా దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ సంస్థల హెచ్చరికలతో నిఘాను పోలీసులు, భద్రతా దళాలు పెంచుతున్నాయి.

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!