AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం, ముందు జాగ్రత్తగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం, అమెరికా

బ్రిటన్ లో ప్రబలిన మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశిలీస్తున్నామని, అయితే ఆ దేశానికి ట్రావెల్ ఆంక్షలపై తామింకా దృష్టి పెట్టలేదని అమెరికా అధికారులు తెలిపారు.

బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం, ముందు జాగ్రత్తగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం, అమెరికా
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 21, 2020 | 11:26 AM

Share

బ్రిటన్ లో ప్రబలిన మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశిలీస్తున్నామని, అయితే ఆ దేశానికి ట్రావెల్ ఆంక్షలపై తామింకా దృష్టి పెట్టలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఏమైనప్పటికీ, ముందు జాగ్రత్తచర్యగా 75 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడిన వృధ్ధులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిపుణులతో కూడిన పానెల్ సిఫారసు చేసింది. పోలీసులు, టీచర్లు, గ్రాసరీ స్టోర్స్ లో పని చేసే ఉద్యోగులతో సహా 3 కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా టీకామందు ఇవ్వనున్నారు. బ్రిటన్ వైరస్ గురించి అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్ వ్యాక్సిన్ ప్రోగ్రాం; చీఫ్ అడ్వైజర్ మోన్సెస్ వివరిస్తూ..తమ దేశంలో బ్రిటన్ వైరస్ ఉందా.లేదా అన్న విషయం ఇంకా తెలియడంలేదన్నారు. ఏమైనా ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకామందులను తట్టుకోగల వైరస్ స్ట్రెయిన్ ఏదీ కనిపించడంలేదన్నారు.పరిశోధనలు జరుగుతున్నాయి గానీ ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన అంశమేదీ వెల్లడి కాలేదు అని అన్నారు.

బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ వాక్సిన్ ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోజాలదని భావిస్తున్నట్టు మొన్సెస్ చెప్పారు. ఏది ఏమైనా మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గత వారం రోజులుగా 2.8 మిలియన్ వ్యాక్సిన్ డోసులను 556,208 మందికి ఇఛ్చినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో 3 లక్షల మందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు.

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..