గబ్బిలాల్లో 5 వేల రకాల కరోనా వైరస్ లున్నాయా..2015లోనే అమెరికా చైనాలు కలిసి రహస్యంగా కరోనా వంటి వైరస్ ను సృష్టించాయా..!

Corona Virus:  కరోనా వైరస్ చైనా సృష్టే అంటూ అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఆరోపించాయి. మానవాళి అంతం నా పంతం అన్న చందంగా రోజుకో రకంగా..

గబ్బిలాల్లో 5 వేల రకాల కరోనా వైరస్ లున్నాయా..2015లోనే అమెరికా చైనాలు కలిసి రహస్యంగా కరోనా వంటి వైరస్ ను సృష్టించాయా..!
Corona
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2021 | 10:36 PM

Corona Virus:  కరోనా వైరస్ చైనా సృష్టే అంటూ అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఆరోపించాయి. మానవాళి అంతం నా పంతం అన్న చందంగా రోజుకో రకంగా మారుతున్న ఈ కరోనా వైరస్ ను గతంలోనే చైనా తయారు చేసిందంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రిక కూడా సంచలన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వైరస్ పై మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అంటూ కొన్ని అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ సృష్టి కోసం చైనాతో అగ్రరాజ్యం చేతులు కలిపిందట.

గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని గడగడాలిస్తున్న కరోనా ఎక్కడ పుట్టింది? అని ప్రశ్నిస్తే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. అయితే అందరి చూపు డ్రాగన్ కంట్రీ వైపే… చైనాలోని వూహాన్ సిటీలోనే తొలి కరోనా కేసు వెలుగు చూసింది. దీంతో ఇది వూహాన్‌లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి లీక్ అయిందని చాలా మంది అప్పట్లో విమర్శలు చేశారు. కానీ ఇప్పటికీ కరోనా మూలాలపై నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. ఎవరి దగ్గరా ఇది ఎక్కడ పుట్టిందనే ప్రశ్నకు సమాధానం లేదు

ఇలాంటి సమయంలో గతంలో జరిగిన ఒక విషయం ప్రస్తుతం పెద్ద చర్చకు ఈసారి వార్తల్లో అగ్రరాజ్యం అమెరికా పేరు కూడా వినిపిస్తోంది. 2015. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (యూఎన్‌సీ), చైనాలోని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి ఒక ప్రయోగం చేశాయి ఆ ప్రయోగంలో ముఖ్య ఉద్దేశ్యం కరోనా వంటి ఓ వైరస్ ను తయారు చేసి.. మానవుల పై ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది తెలుసుకోవడం అట. దీంతో ఈ రెండు దేశాలు కలిసి మానవుల శరీర కణాలకు అతుక్కొని ఊపిరితిత్తుల్లో తమ సంఖ్యను పెంచుకొని, మనిషి అవయవాలపై ప్రభం చూపగల సామర్థ్యం ఉన్న వైరస్‌ను ఈ రెండు దేశాలు కలిసి తయారుచేశాయట. శాస్త్ర పరిభాషలో ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ అని పిలుచుకునే ఈ రకం పరిశోధనలు గతంలో కూడా జరిగాయట. ఈ పరిశోధనల్లో తయారు చేసిన సూక్ష్మ క్రిముల వల్ల భవిష్యత్ లో ఎటువంటి అంటువ్యాధులు వస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞలు ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అంటువ్యాధులు విజృంభిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చికిత్స ఏ విధంగా అందించాలి వంటి అనే అంశాలను పరిగణలోకి తీసుకుని అమెరికా, చైనా దేశాలు ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ పరిశోధనలను చేశాయి.

చైనాలో ఉండే హార్స్‌షూ గబ్బిలాల్లో కనిపించే ఎస్‌హెచ్‌సీ014-సీవోవీ అనే స్పైక్ ప్రొటీన్‌కు చెందిన ఒక వైరస్‌ను తీసుకొని, దాన్ని సార్స్ వంటి వైరస్‌కు కలిపారట. ఆ తర్వాత ఈ కొత్త రకం వైరస్‌ను ఎలుకలకు ఎక్కిస్తే వాటి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఉన్న అన్ని రకాల చికిత్సా విధానాలు వాడినా ఆ ఎలుకలను కాపాడలేకపోయారట.

వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో గబ్బిలాల ద్వారా వ్యాపించే సార్స్ వంటి వైరసులపై పరిశోధనలు చేసే జెంగ్లీ లి షి అనే శాస్త్రవేత్త. ఈ స్పైక్ ప్రొటీన్‌ను అమెరికాకు అందించారట. అయితే ఈ పరిశోధనలు పూర్తి కాకుండానే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిధులు కేటాయించడం ఆపేసింది. ఒబామా నిర్ణయాన్ని శాస్త్రజ్ఞలు కొందరు తప్పుపట్టారు. భవిష్యత్ లో ఏవైనా మహమ్మారి పరిస్థితులు ఏర్పడితే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక అంచనా వేసే అవకాశం పోతుందని వాదించారు. అయితే ప్రపంచం వ్యాప్తంగా గబ్బిలపై ఇప్పటి వరకూ చేసిన అధ్యయనాల ప్రకారం వాటిల్లో 5వేల రకాల కరోనా వైరసులు ఉన్నాయని, వీటిలో కొన్ని మానవులకు సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు ఎప్పుడో చెప్పారు. అయితే చైనా అమెరికా సంయుక్త పరిశోధనలపై 2020 ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం కరోనా వైరస్ తమ సృష్టికాదని నిరూపించింది. .2015 లోని వైరస్ ఇప్పుడు విజృంభిస్తున్న వైరస్ లు రెండు సీక్వెన్స్ వేరు వేరుగా ఉన్నట్లు ధ్రువీకరించిందా బృందం.

Also Read: ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్షేత్రానికి కలియుగాంతానికి లింక్ ఉందని భక్తుల నమ్మకం.. కాలజ్ఞానంలో కూడా ప్రస్తావన  

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై