Mysterious Boiling River: ఆ నదిలో నీరు 24గంటలు మరుగుతూనే ఉంటుంది.. నిప్పులేకుండా వంట రెడీ

Mysterious Boiling River: ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం నదులు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద అనేక నదులున్నాయి. నదుల ఒడ్డున అనేక ప్రఖ్యాత నగరాలు . ప్రముఖ క్షేత్రాలు వెలిశాయి.

Mysterious Boiling River: ఆ నదిలో నీరు 24గంటలు మరుగుతూనే ఉంటుంది.. నిప్పులేకుండా వంట రెడీ
Boiling River Of Mayantuyac
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2021 | 10:40 AM

Mysterious Boiling River:ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం నదులు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద అనేక నదులున్నాయి. నదుల ఒడ్డున అనేక ప్రఖ్యాత నగరాలు . ప్రముఖ క్షేత్రాలు వెలిశాయి. ఎక్కడ నీరు సమృద్దిగా లభిస్తుందో.. అక్కడ నాగరికత వెల్లువిరుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.. ఇక నదులు.. వాటి సోయగాలు మనిషికి ఎప్పుడు ఆనందం కలిగిస్తాయి. ఇక కెనెడా ఐతే ప్రపంచంలోనే అత్యంధికంగా నదులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. కానీ అన్ని నదుల విశిష్టతలను తలదాన్నెలా ఒక నది విశిష్టతను కలిగి ఉంది.. ఆ నదిలో నీరు 24 గంటలూ మరుగుతూనే ఉంటుంది. ఈ బాయిలింగ్ నది ఎక్కడ ఉన్నదో తెలుసా…! అమెరికాలో… అమెజాన్ ప్రదేశంలోని ‘పెరు’ దేశంలో మయంటుయాకు ప్రాంతంలో ఒక విచిత్రమైన నదిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

అమెజాన్ ప్రదేశంలోని ‘పెరు’ దేశంలో మయంటుయా ప్రాంతంలో సముద్ర తీరంలో ఒక విచిత్ర నది ఉంది. ఆ నది నీరు 24 గంటలు వేడిగానే ఉంటుంది. అందుకనే ఈ నదిని “బాయిలింగ్ రివర్” అని అంటారు. ఈ నది అడవి మధ్యన ఉంటుంది.. అయినా నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతూంటుంది. ఈ నదిని 2011 లో కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ నది దాదాపు నాలుగు మైళ్ళ వరకు వేడిగా ప్రవహిస్తుంది. దాని వెడల్పు వద్ద 80 అడుగులు లోతు వద్ద 16 అడుగులు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్పారు.

ఈ నదిలో నీరు ఏ కాలమైన వేడిగా ఉంటుందని.. ఏ జంతువు ఈ నీటిలో పడినా బతకడం కష్టం అని అంటున్నారు. ఈ నదిలో నీటితో వంట కూడా చేసుకోవచ్చట.. ఇలా నీరు ఇంతవేడిగా ఉండడానికి కారణం బహుశా నది అడుగున అగ్ని పర్వతం ఉండి ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రకృతిపై మనిషి పై చేయి సాధించాను అని భావించినప్పుడల్లా.. ఇదిగో ఈ వింత చూడు.. అని మనిషికి ప్రకృతి సవాల్ విసురుతూనే ఉంటుంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: కార్తీక్ మోసం చేశాడంటూ మోనిత కన్నీరు.. దీపని ఎప్పటికీ నమ్మనంటున్న డాక్టర్ బాబు

సారంగదారియా సాంగ్ కోమలిది కూడా కాదు.. 70 ఏళ్ల క్రితం నుంచి ఉంది.. ఇదిగో సాక్ష్యం