Vladimir Putin: 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్న వ్లాదిమిర్‌ పుతిన్‌.. కొత్త చట్టంతో పదవి కాలం పెంపు

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ 2036 వరకు కొనసాగనున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన పదవీ కాలం 2024తో ముగియనుండా, 2036 వరకు...

Vladimir Putin: 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్న వ్లాదిమిర్‌ పుతిన్‌.. కొత్త చట్టంతో పదవి కాలం పెంపు
Vladimir Putin
Follow us
Subhash Goud

|

Updated on: Apr 06, 2021 | 10:09 AM

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ 2036 వరకు కొనసాగనున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన పదవీ కాలం 2024తో ముగియనుండా, 2036 వరకు పదవిలో కొనసాగే చట్టంపై ఆయన సోమవారం సంతకం చేశారు. తాజాగా తీసుకువచ్చిన కొత్త చట్టంతో ఈ టర్మ్‌ ముగిసిన తర్వాత కూడా మరో రెండు దఫాలుగా పదవిలో కొనసాగనున్నారు.

అయితే ప్రస్తుతం పుతిన్‌ రెండోసారి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. చట్టంలోని మార్పుల కోసం గత ఏడాది వేసవిలో ఎన్నికలు నిర్వహించారు. 68 శాతం మంది ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఓట్లు వేశారు. ప్రస్తుతం 68 ఏళ్లు ఉన్న పుతిన్‌ 83 ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

నాలుగేళ్లలో తన పదవీ కాలం ముగియనుండగా, అపై మరో 12 ఏళ్ల వరకు తనకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. 2024 తరువాత మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలకు రష్యా పార్లమెంట్‌ తో ఆమోద ముద్ర వేయించుకున్నారు.

కాగా, ఈ మేరకు ‘ద స్టేట్‌ డ్యూమా’ దేశ రాజ్యాంగ సవరణలకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం గమనార్హం. 43 మంది పార్లమెంట్ సభ్యులు హాజరు కాలేదు. ‘ద స్టేట్‌ డ్యూమా’ ఈ సవరణలకు ఆమోదం పలికిన గంటల వ్యవధిలోనే ఎగువ సభ ‘ఫెడరేషన్‌ కౌన్సిల్‌’ ఆమోదం కూడా లభించింది.

ఇవీ చదవండి: Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం.. దేశద్రోహం కేసులో గృహ నిర్బంధంలో మాజీ యువరాజు..!

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!