Mass Execution: మహిళలు, పిల్లలు సహా ఒకేసారి 81మందికి ఉరిశిక్ష.. సౌదీ అరేబియా సర్కార్ సంచలన నిర్ణయం!
Saudi Arabia Mass Execution: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది.
Mass Execution in Saudi Arabia: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. తీవ్రవాద గ్రూపుల(Terrorist Groups)తో సంబంధాలు సహా వివిధ నేరాల(Multiple Heinous Crimes)కు పాల్పడిన 81 మందిని శనివారం ఉరితీసింది. ఆధునిక చరిత్రలో ఒకేరోజు అత్యధిక సంఖ్యలో వ్యక్తులకు ఏకంగా మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. 1980లో మక్కా మసీదు స్వాధీనం నేరంలో 63 మంది తలలు నరికి సౌదీ మరణ శిక్ష అమలు చేసింది. శిక్ష అమలైన వారిలో మహిళలు, పిల్లల్ని చంపిన వారితో పాటు అల్ ఖాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, యెమన్‌లోని హైతీ తిరుగుబాటుదారులకు మద్దతునిచ్చిన వారు కూడా ఉన్నారు.
అయితే, ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయడానికి శనివారం ఎందుకు ఎంచుకుంది అనేది స్పష్టంగా లేదు. ప్రపంచం మొత్తం దృష్టి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కేంద్రీకృతమై ఉన్న సమయంలో ఈ పరిణామం జరిగింది. కింగ్ సల్మాన్ అతని కుమారుడు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో వివిధ కేసులలో దోషుల శిరచ్ఛేదం కొనసాగినప్పటికీ, సౌదీ అరేబియాలో మరణశిక్ష కేసుల సంఖ్య కరోనావైరస్ మహమ్మారి సమయంలో తగ్గింది. శనివారం విధించిన మరణశిక్షల వివరాలను తెలియజేస్తూ, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.అమాయక పురుషులు, మహిళలు, పిల్లల హత్యలతో సహా వివిధ నేరాలకు పాల్పడిన దోషులు ఉన్నట్లు తెలిపింది. ఉరితీసిన వారిలో కొందరు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులని కూడా ప్రభుత్వం తెలిపింది. మరణశిక్ష పడిన వారిలో సౌదీ అరేబియాకు చెందిన 73 మంది, యెమెన్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. ఒక సిరియన్ పౌరుడికి కూడా మరణశిక్ష విధించారు. అయితే మరణశిక్ష ఎక్కడ విధించారనేది మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు, సౌదీ అరేరియాలో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటిని ఎవరు ఉల్లంఘించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అంతే కాదు ఇక్కడ ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వాలు నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సౌదీ అరేబియాలో చట్టం పేరుతో ఇలా బలవంతంగా ప్రాణాలు తీసే విధానాన్ని ప్రపంచ దేశాలు, మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎన్నో సార్లు ఖండించాయి. ఇలాంటివి జరిగిన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇదిలావుంటే, సౌదీ అరేబియా మరణశిక్ష విధించడాన్ని మానవ హక్కుల సంస్థలు విమర్శించాయి. మహ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణకు హామీ ఇచ్చినప్పుడు రక్తపాతం తప్పదని ప్రపంచం ఇప్పటికైనా తెలుసుకోవాలని లండన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ రిప్రైవ్ డిప్యూటీ డైరెక్టర్ సొరయా బోవెన్స్ అన్నారు. మరణశిక్ష విధించడం ద్వారా మానసికంగా, శరీరంగా హింసించారని, రహస్యంగా విచారించారని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ అలీ అదుబాసి ఆరోపించారు. ఇదిలావుంటే, అంతకుముందు, జనవరి 2016లో, షియా మత గురువుతో సహా 47 మందిని సామూహికంగా ఉరితీశారు. అదే సమయంలో, 2019 సంవత్సరంలో 37 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ మైనారిటీలలో అత్యధికులు షియా వర్గానికి చెందినవారు కావడం విశేషం.