Chanakya Niti: ఇలాంటి స్త్రీ జీవిత భాగస్వామిగా దొరికితే.. దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya)తన జ్ఞానాన్ని 'వంచక'గా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. చాణక్యుడు సమర్ధవంతమైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya)తన జ్ఞానాన్ని ‘వంచక’గా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. చాణక్యుడు సమర్ధవంతమైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు అనేక విషయాలపై అవగాహన కలిగి ఉన్నాడు. తన అనుభవాలను అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం.. ఆచార్య చాణక్యుడు స్త్రీకి సంబంధించిన కొన్ని లక్షణాలను వివరించాడు. జీవితంలో మంచి జీవిత భాగస్వామి దొరికితే.. మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. భార్య ప్రత్యేక లక్షణాల ఆచార్య చాణుక్యుడు చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం..
- చాణక్య నీతి ప్రకారం.. ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని పాటించే మహిళ… ఆమె ఎవరికీ హాని చేయదు. మొత్తం కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాంటి స్త్రీ తనకు తానుగా స్థిరపడటమే కాకుండా, ఆమె ముందు తరానికి కూడా మంచి విద్యను కూడా అందిస్తుంది. అలాంటి స్త్రీ వంశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తుంది.
- మధురంగా మాట్లాడే స్త్రీ అందరి హృదయాలను గెలుచుకుంటుంది. అలాంటి స్త్రీ కుటుంబంలో అందరికీ ప్రియమైన వ్యక్తిగా మారుతుంది. కుటుంబ పరువు ప్రతిష్టలను మరింత పెరిగేలా చూసుకుంటారు. అలాంటి స్త్రీ ఎటువంటి పరిస్థితిలో నైనా తట్టుకుంటూ.. ప్రేమగా మేలుగుతోంది.
- చాలా ప్రశాంతంగా ఉండే స్త్రీకి సహనం అనే గుణం ఉంటుంది. ఆమె చిన్న విషయాలను మనసులో పెట్టుకోదు. ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు తెలుసు. ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం ఉంటుంది.