Russia – Ukraine War: రష్యా యుద్ధ వాహనాలపై ‘Z’ సింబల్.. ఎందుకో తెలుసా..?

ఉక్రెయిన్‌ సరిహద్దులు, నగరాల్లో వేలాది రష్యన్‌ యుద్ధ వాహనాలు తిరుగుతున్నాయి. అయితే ఆ వాహనాలన్నింటిపై ‘Z’ గుర్తులు దర్శనమిస్తుండటం ప్రంపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Russia - Ukraine War: రష్యా యుద్ధ వాహనాలపై ‘Z’ సింబల్.. ఎందుకో తెలుసా..?
Russia Z Sybol
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 08, 2022 | 6:46 AM

Russia – Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 13వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలపై రష్యా సైన్యం(Russian Army) పట్టుసాధించింది. అయితే ఆక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ సరిహద్దులు, నగరాల్లో వేలాది రష్యన్‌ యుద్ధ వాహనాలు(War Tanks) తిరుగుతున్నాయి. అయితే ఆ వాహనాలన్నింటిపై ‘Z’ గుర్తులు(Z Symbol) దర్శనమిస్తుండటం ప్రంపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ముదురు ఆకుపచ్చ రంగు వాహనాలపై తెరుపు రంగులో ‘Z’ అక్షరం కనిపిస్తోంది. అయితే ఆ గుర్తుకు అర్థం ఏంటి? అది దేనికి చిహ్నం అనే చర్చ అంతటా మొదలైంది.

రష్యన్ సైన్యానికి చెందిన యుద్ధ ట్యాంకులు, వాహనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, వాటిపై Z అని వ్రాయబడి ఉంటుంది. కానీ కొన్ని మార్పులతో. ఉదాహరణకు, Z అనేది కొన్ని ప్రదేశాలలో నేరుగా వ్రాయబడం జరిగింది. అదే సమయంలో, Z ఒక త్రిభుజంలో వ్రాయబడిన కొన్ని రష్యన్ వాహనాలు ఉన్నాయి. ఇది యుద్ధంలో విభిన్న అర్థాలను కలిగి ఉంటుంది. కాగా ఈ ప్రశ్నలకు మాస్కోలోని పరిశోధకుడు, జర్నలిస్ట్‌ కామిల్‌ గలీవ్‌ సమాధానమిచ్చాడు. రష్యా నుంచి ఉక్రెయిన్‌లోకి వెళ్లే వాహనాలపైన మాత్రమే ‘Z’ అక్షరాలను ముద్రించారని, అయితే ఆ గుర్తును కొందరు విజయానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. మరికొందరు Zను Zapad అనే పదం కోసం ఉపయోగిస్తారని, దానర్థం ‘పశ్చిమం’ అని వివరించారు. కాగా ఈ గుర్తు కొద్దిరోజుల క్రితమే ప్రచారంలోకి వచ్చిందని పేర్కొన్న కామిల్‌ గలీవ్‌.. ప్రస్తుతం అది రష్యన్ భావజాలంగా, జాతీయ గుర్తింపుకు చిహ్నంగా మారినట్లు వెల్లడించారు.

యుద్ధభూమిలో రష్యన్‌ సైనికులే ఒకరిపై ఒకరు దాడి చేసుకోకుండా.. పొరపాట్లు, గందరగోళానికి గురికాకుండా ఈ తరహా ముద్రలు ఉపయోగపడతాయని మరికొందరు పేర్కొంటున్నారు. మరో విషయం.. ఈ రకమైన గుర్తును రోస్గ్వార్డియా ట్రూప్స్ కోసం ఉపయోగిస్తారు. రోస్వార్డియా ట్రూప్స్ అంటే రష్యన్ నేషనల్ గార్డ్ నుండి అని అర్థం. ఇది సైనికులకు భిన్నంగా ఉంటుంది. రోస్వర్దియా ట్రూప్స్ నేరుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు దాని అన్ని చర్యల గురించి నేరుగా పర్యవేక్షిస్తుంటారు. రష్యా డిఫెన్స్ పాలసీ చదువుతున్న విద్యార్థి రాబ్ లీ దీనికి సంబంధించిన పలు సమాచారాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశాడు. రాబ్ ప్రకారం, ఇది ఒక రకమైన ఎర్ర జెండా. ఖైదీలను తరలించే వాహనాలపై ఈ గుర్తు ఉంటుంది. సాధారణంగా, బెల్గోరోడ్ ప్రాంతంలో ఇటువంటి వాహనాలపై Z గుర్తు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. రష్యాలోని కొన్ని వర్గాల్లో Z గుర్తుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ అక్షరాన్ని టీ-షర్ట్‌లపై ముద్రించి, వాటిని ధరించి తిరుగుతున్నారు. కొందరు తమ కార్లపైనా ఈ గుర్తును ముద్రిస్తున్నారు.

Read Also… Viral Video: జడేజా స్టైల్‌ని ఫాలో అవుతున్న ఏనుగు పిల్ల.. ఫిదా అవుతున్న నెటిజన్లు