Russia-Ukraine war: పెంపుడు కుక్కను విడిచిపెట్టి నేను రాలేను.. మాకు సాయం చేయండి.. భారత విద్యార్థి వేడుకోలు..

Russia-Ukraine war: రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. ఈ క్రమంలో భారతదేశానికి చెందిన విద్యార్థులు అక్కడ చిక్కుకొని అల్లాడుతున్నారు. వారిని..

Russia-Ukraine war: పెంపుడు కుక్కను విడిచిపెట్టి నేను రాలేను.. మాకు సాయం చేయండి.. భారత విద్యార్థి వేడుకోలు..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2022 | 2:40 PM

Russia-Ukraine war: రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. ఈ క్రమంలో భారతదేశానికి చెందిన విద్యార్థులు అక్కడ చిక్కుకొని అల్లాడుతున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాలు దేశానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ (Ukraine)లో చిక్కుకున్న మూడో సంవత్సరం చదువున్న ఇంజనీరింగ్ విద్యార్థి (Engineering Student)వార్తల్లో కెక్కాడు. తన పెంపుడు కుక్క లేకుండా దేశం విడిచి రానంటూ మొండికేసి కూర్చున్నాడు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్‌ (National University of Radio Electronics)లో చదువుతున్న రిషబ్ కౌశిక్ (Rishabh Kaushik).. తాను ఎయిర్‌లిఫ్ట్ చేసినప్పుడు తన కుక్క తనతో పాటు వచ్చేలా అన్ని పత్రాలు, క్లియరెన్స్‌లను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే అధికారులను అడుగుతున్నప్పటికీ.. తనకు సాయం చేయడంలేదంటూ పేర్కొన్నాడు. అధికారులు నా విమాన టిక్కెట్‌ను అడుగుతున్నారని తెలిపాడు. ఉక్రెయిన్ గగనతలం మూసివేస్తే విమాన టిక్కెట్‌ను ఎలా పొందగలనంటూ ప్రశ్నించాడు.

మిస్టర్ కౌశిక్ ఢిల్లీలోని భారత ప్రభుత్వం యానిమల్ క్వారంటైన్, సర్టిఫికేషన్ సర్వీస్ (AQCS)ని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని, అయితే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయాడు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో అతను తన పరిస్థితి గురించి ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టులో ఒకరికి ఫోన్‌ చేశానని, అయితే మరో వైపు ఉన్న వ్యక్తి తనపై దుర్భాషలాడాడని అన్నారు.

అయితే చట్ట ప్రకారం.. భారత ప్రభుత్వం నాకు అవసరమైన నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (NOC) ఇస్తే నేను ప్రస్తుతం భారతదేశంలో ఉండేవాడనని చెప్పుకొచ్చాడు. కౌశిక్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఒక బంకర్‌లో తలదాచుకున్నాడు. ఫిబ్రవరి 27న  విమానం ఉన్నందున నేను ఇక్కడ చిక్కుకున్నాను అని అతను చెప్పాడు. వీడియో ఫ్రేమ్‌లో కుక్కపిల్లని పరిచయం చేస్తూ, నిరంతరంగా బాంబింగ్ చేసే శబ్దాల కారణంగా జంతువు ఒత్తిడికి గురవుతుందని అన్నాడు.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌కు జపనీస్ బిలియనీర్ హిరోషి మికిటాని ఆర్థిక సాయం.. ఎంత ప్రకటించారో తెలుసా?

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం.. ప్రాణం పోయిన తగ్గేదీలేదంటున్న జెలెన్‌స్కీ