Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీలక సూచనలు.. ఇండియన్ ఎంబసీ కొత్త గైడ్‌లైన్స్ జారీ

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల కోసం కేవ్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీలక సూచనలు.. ఇండియన్ ఎంబసీ కొత్త గైడ్‌లైన్స్ జారీ
Indian In Ukraine
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 28, 2022 | 5:52 PM

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల(Indian Nationals) కోసం కేవ్‌(Kyiv)లోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy in Ukraine) సోమవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కేవ్ నగరంలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేసినందున రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని భారతీయ రాయబార కార్యాలయం భారతీయ విద్యార్థులను సూచించింది. కొత్త సూచలన ప్రకారం, కైవ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేయడం జరిగింది. ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు విద్యార్థులందరూ రైలు స్టేషన్ మార్గాన్ని తీసుకోవాలని సూచించారు.

భారత రాయబార కార్యాలయం జారీ చేసిన సలహాలో, ఉక్రెయిన్ రైల్వేలు తరలింపు కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చెప్పడం జరిగింది. భారతీయ పౌరులు, విద్యార్థులు ప్రశాంతంగా, శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలని రాయబార కార్యాలయం కోరింది. స్టేషన్‌లో భారీగా జనం గుమిగూడే అవకాశం ఉందని, రైళ్లు కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని రాయబార కార్యాలయం తెలిపింది. అటువంటి పరిస్థితిలో, భారతీయ విద్యార్థులు తమ సహనం, శాంతిని కాపాడుకోవాలని సూచించింది. ఎలాంటి దూకుడు వైఖరిని అవలంబించకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైలు షెడ్యూళ్లలో ఆలస్యాలు, రద్దులు, పొడవైన క్యూల గురించి కూడా విద్యార్థులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. భారతీయ విద్యార్థులు తమ పాస్‌పోర్ట్, తగినంత నగదు, సిద్ధంగా ఉన్న ఆహారం, సులభంగా అందుబాటులో ఉండే చలికాలపు బట్టలు, అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ఈ క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన సమయాల్లో భారతీయ పౌరుల తరలింపు ప్రయత్నాలను సులభతరం చేయడంలో ఉక్రెయిన్ పౌరులు, అధికారులు ఇద్దరూ విశేషమైన సహాయాన్ని అందించారు.

ఇదిలావుంటే, 249 మంది భారతీయ పౌరులతో ఐదవ విమానం రొమేనియాలోని బుకారెస్ట్ నుండి ఢిల్లీకి ఆపరేషన్ గంగా కింద బయలుదేరిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. ప్రస్తుత ఉక్రెయిన్ రష్యా సంక్షోభం మధ్య, ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులను సందర్శించవద్దని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులను ఆదేశించింది.

Read Also…. Russia-Ukraine Crisis: బెలారస్‌లో కొనసాగుతున్న చర్చలు.. భారతీయులకు కొత్త మార్గదర్శకాలు జారీ