Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్ ..భారీగా తగ్గిన జననాలు.. పెరిగిన మరణాలు..జనాభా సంక్షోభంలో ఆ దేశం.. పిల్లల్ని కనండి మహాప్రభో అంటున్న ప్రభుత్వం

Russia Population: అసలే కరోనా (Corona(కోరల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్న రష్యా(Russia )కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. ఆ దేశం ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరోనా వెలుగులోకి

కరోనా ఎఫెక్ట్ ..భారీగా తగ్గిన జననాలు.. పెరిగిన మరణాలు..జనాభా సంక్షోభంలో ఆ దేశం.. పిల్లల్ని కనండి మహాప్రభో అంటున్న ప్రభుత్వం
Russia Records Historic Population Loss
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2022 | 8:47 AM

Russia Population: అసలే కరోనా (Corona(కోరల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్న రష్యా(Russia )కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. ఆ దేశం ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత భారీగా జనాభా మృతి చెందారు. మరోవైపు జననాల రేటు కూడా అతితక్కువగా ఉంది. దీంతో గత ఏడాది ఏకంగా ఆ దేశ జనాభా భారీగా పడిపోయింది. దాదాపు పది లక్షలకంటే ఎక్కువమంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ ‘రోస్‌స్టాట్’ ప్రకటించింది. సోవియట్ యూనియన్ పతనం అనంతరం ఈ రేంజ్ లో జనాభా క్షీణించడం ఇదే మొదటి సారని అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే..

రష్యాలో 2020 లో జనాభా 5 లక్షలకుపైగా తగ్గిపోగా.. గత ఏడాది 2021 లో ఏకంగా జనాభా పది లక్షలు దాటింది. ముఖ్యంగా గత ఏడాదిలో కరోనా బారిన పడినవారు 6.60 లక్షల మంది మరణించినట్లు రోస్‌స్టాట్ వెల్లడించింది. ఈ మరణాలకు కారణం ప్రభుత్వం, ప్రజల నిర్లక్షమని.. ప్రపంచంలో అందరికంటే ముందుగా కరోనా వ్యాక్సిన్ ను తీసుకొచ్చినా ప్రజలకు ఇచ్చే విషయంలో చాలా మందకొండిగా సాగిందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ప్రజలు కోరనా నిబంధనలు పాటించకపోవడం మరో కారణం అని పేర్కొంది. మాస్కులు ధరించకపోవడం, పరిమిత ఆంక్షలు తదితర కారణాలతో రష్యాలో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించింది. భారీగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఇక రష్యాలో గత ముఫై ఏళ్లుగా జననాల రేటు తక్కువగా ఉంది. అంతేకాదు ప్రజల జీవన ఆయుస్సు కూడా తక్కువ వంటి అనేక సమస్యలతో సతమతమవుతుంది. వీటికి కోవిడ్ జత అవ్వడంతో దేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

రష్యా.. జనాభా వృద్ధికి ఇక్కడ మహిళల కనిష్ఠ సంతానోత్పత్తి రేటును 2.1గా నిర్ణయించగా.. ప్రస్తుతం 1.5గా మాత్రమే ఉంది. సోవియట్ యూనియన్ పతనమైన సమయంలో ఏర్పడిన అనిశ్చితి వలన అప్పుడు పుట్టిన ప్రజలు ఇప్పుడు తల్లిదండ్రులుగా మారడంతో.. కరోనా ఈ కారణాల వలన ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొన్నారు.

ఏడాది ఏడాదికి జననాల రేటు పడిపోతుండడంతో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టారు. రష్యా దేశం నైసర్గిక స్వరూపం.. భౌగోళిక పరిస్థితిలను రాజకీయ కోణాల నుంచి చూస్తే ప్రస్తుతం ఉన్న జనాభా సరిపోరని చెప్పారు.. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఉన్న 14.6 కోట్ల మంది ఉన్నారని.. జననాలు తగ్గడం వలన.. యువ శక్తి తగ్గుతుందని.. దీంతో దేశం కార్మిక శక్తికి కొరత కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తమవుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇప్పటికే జనాభా పెరుగుదల కోసం చర్యలు మొదలు పెట్టారు. ఒకటి కంటే ఎక్కువమంది పిల్లలను కనే తల్లిదండ్రులకు ప్రత్యెక ప్రోత్సాహకాలను ప్రకటించింది. నగదును బహుమతిగా ఇవన్నున్నామని తెలిపింది.

దేశం జనాభా సంక్షోభంలో చిక్కుకోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే అంటూ మాస్కోలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జనాభా శాస్త్ర నిపుణుడు సెర్గీ జఖారోవ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన విధంగా స్పందించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించక పోతే మరింత సంక్షోభం తప్పదంటూ హెచ్చరించారు. మరోవైపు సామాజిక సంస్థ ‘లెవాడా సెంటర్’ ప్రతినిధి స్టెపాన్ గోంచరోవ్ స్పందిస్తూ.. దేశంలో ప్రజల్లో ఏర్పడిన భవిష్యత్ పై ఆందోళన వలనే జననాల రేటు గణనీయంగా పడిపోయిందన్నారు. ముఖ్యంగా 2014 నుంచి రష్యాలో జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ప్రజల ఆదాయం తగ్గడమే కాదు.. అవినీతి కూడా ఓ కారణమని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు తల్లిదండ్రులుగా మారడానికి ఆసక్తి కోల్పోతున్నారని చెప్పారు.

Also Read:  ఈ స్తోత్రం రథ సప్తమి రోజున పారాయణం చేస్తే.. సమస్త భోగాలు మీ సొంతం.. ఆరోగ్యం కోసం ఆదివారం ఏమి చేయాలంటే..

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..