Ratha Satpami: ఈ స్తోత్రం రథ సప్తమి రోజున పారాయణం చేస్తే.. సమస్త భోగాలు మీ సొంతం.. ఆరోగ్యం కోసం ఆదివారం ఏమి చేయాలంటే..

Aditya Hrudayam-Ratha Saptami:సూర్యుడిని కీర్తిస్తూ సాగే ఆదిత్య హృదయం(Aditya Hrudayam) రోజూ చదివితే ఇచ్చే ఫలితాలు అనంతం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తూ ఆదివారం(Sunday) గోమాతకు..

Ratha Satpami: ఈ స్తోత్రం రథ సప్తమి రోజున పారాయణం చేస్తే.. సమస్త భోగాలు మీ సొంతం.. ఆరోగ్యం కోసం ఆదివారం ఏమి చేయాలంటే..
Aaditya Hrudyaam Ratha Saptami
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2022 | 7:39 AM

Aditya Hrudayam-Ratha Saptami:సూర్యుడిని కీర్తిస్తూ సాగే ఆదిత్య హృదయం(Aditya Hrudayam) రోజూ చదివితే ఇచ్చే ఫలితాలు అనంతం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తూ ఆదివారం(Sunday) గోమాతకు గోధుమలను నివేదిస్తే.. మేలు జరుగుతుంది. ఏ కోరికను ఆశించకుండా ఈ స్తోత్రంను ప్రతిరోజూ చదివినట్లైతే అన్ని సమస్యలు తొలగి విజయాన్ని అందుకుంటారు..ఈ ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణం(Ramayana) లో యుద్ద కాండలో చెప్పబడింది. జాతకంలో రవి స్థానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. సూర్య నమస్కారం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వంటివి పురాణం కాలం నుంచి వస్తున్నావే.. తీవ్ర వృత్తి సమస్యలలో ఉన్న వారు, జాతకంలో రవి గ్రహంచే బాధలు పొందేవారు ప్రతిరోజూ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్ధిక, ఋణ సమస్యలను , ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది. సూర్యుడి జన్మ తిధి రథసప్తమి రోజు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయి.

ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ || రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ || ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ | జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ || సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ | చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ || రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ || సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ || ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ || పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ || ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ || హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ || హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ || వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః | ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ || ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ || నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ || నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ || జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ || నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ || బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ || తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే | కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ || తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ || నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ || ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ || వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ || ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ || పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ | ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ || అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ || ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా | ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ || ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ || రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ | సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ || అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః | నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ || (సేకరణ)

రావనసుడితో యుద్ధం చేసి అలసిన శ్రీరాముడికి అగస్త్య మహర్షి యుద్ద స్థలానికి వచ్చి ఈ ఆదిత్యహృదయం అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఈ ఉపదేశం పొందిన శ్రీరాముడు.. రావణుడిని సంహరించాడు. అందుకనే ఎవరైనా విజయం కోసం ఈ ఆదిత్యహృదయాన్ని ప్రతి రోజు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో పారాయణం చేయాలి.

Also Read:

: 21 రోజుల తర్వాత మళ్ళీ తెరచుకోనున్న పూరి జగన్నాథుని ఆలయం.. దర్శించుకోవాలంటే కండిషన్స్ అప్లై..

 క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..