Russia: రుణ చెల్లింపులో పుతిన్ ప్రభుత్వం విఫలం.. 100 ఏళ్ల తర్వాత రష్యాలో అలాంటి పరిస్థితి..
ఆంక్షల దెబ్బకు 104 ఏళ్ల చరిత్రలో తొలిసారి డీఫాల్ట్ అయింది రష్యా.. విదేశాలకు చెల్లింపులు చేయలేకపోయింది. తమ అకౌంట్స్ బ్లాక్ కావడమే కారణమంటోది రష్యా..
Russia Default: బలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన రష్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ శతాబ్దంలో తొలిసారి డీఫాల్ట్ అయింది. 1918 తర్వాత తొలిసారి విదేశాలకు చెల్లింపులు చేయలేకపోయింది. రష్యాలో బోల్షివిక్ విప్లవం తర్వాత తొలిసారిగా ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు.. అప్పట్లో విదేశాలకు చెల్లింపులను కొత్తగా ఏర్పడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వం నిరాకరించింది. కానీ 104 ఏళ్ల తర్వాత ఇప్పుడు రష్యా దగ్గర తగినంత డబ్బు ఉన్నా అంతర్జాతీయ రుణ దాతలకు 100 మిలియన్ల డాలర్లు చెల్లించడంలో విఫలమైంది. కాగా తాజా పరిస్థితిపై రష్యా వెంటనే స్పందించింది.. తాము చెల్లింపులు చేశామనీ, థర్డ్ పార్టీలు వాటిని బ్లాక్ చేయడం వల్ల ఇలా జరిగిందని తెలిపింది. రష్యా మే 27వ 100 మిలియన్ డాలర్ల సొమ్మును యూరోక్లియర్ బ్యాంక్‌కు పంపించింది. ఈ బ్యాంకు నుంచి రుణదాతలకు చెల్లించాలి.. కానీ డబ్బు 30 రోజులు గడిచినా రుణదాతలకు చేరలేదు. ఈ డబ్బును నిలిపి సమాచారం కూడా ఇవ్వలేదు యూరోక్లియర్.
ఉక్రెయిన్ వార్ తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు రష్యా మీద విధించిన ఆంక్షలకు కట్టుబడి ఉన్నామని మాత్రమే పేర్కొంది. రెండురోజుల ముందు అమెరికా ట్రెజరీ శాఖ తీసుకొన్న నిర్ణయం సాంకేతికంగా రష్యా డీఫాల్ట్ కావడానికి కారణమైంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు రూబుల్స్ రూపంలో రష్యన్ బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయాలని క్రెమ్లిన్ నిర్ణయం తీసుకుంది. విదేశీ చెల్లింపు వ్యవస్థలు సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, తాము ఎలాంటి రుణాలను ఎగవేయలేదని రష్యా స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..